Site icon HashtagU Telugu

VVS Laxman: ఐర్లాండ్‌తో టీ 20 సిరీస్ ఆడనున్న టీమిండియా జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ గా ఎంపిక…

National Cricket Academy

National Cricket Academy

జూన్ చివరిలో జరిగే ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రధాన కోచ్‌గా VVS లక్ష్మణ్ ఎంపికయ్యాడు. ఒక టెస్ట్, 5 T20ల సన్నాహాలను పర్యవేక్షించడానికి రాహుల్ ద్రవిడ్ ఇంగ్లాండ్‌లో ఉన్నసమయంలో టీమిండియా ఐర్లాండ్‌లో రెండు T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ కు వీవీఎస్ ను హెడ్ కోచ్ గా ఎంపిక చేశారు.

టీమిండియా జూన్ 26, 28 తేదీలలో రెండు T20 మ్యాచుల సిరీస్ ఆడేందుకు ఐర్లాండ్‌కు వెళ్లనుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌లో టీమిండియా గత సంవత్సరం కోవిడ్ వల్ల వాయిదా వేసిన టెస్టు మ్యాచు సిరిస్ ను కొనసాగించనుంది. జులై 1 నుంచి 5 వరకు జరిగే టెస్టు తర్వాత, ఇంగ్లండ్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.

ఐర్లాండ్‌లో జరిగే రెండు మ్యాచ్‌ల కోసం భారత జట్టుకు కోచ్‌గా నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే జూన్ 24-27 వరకు లీసెస్టర్‌ కౌంటీ జట్టుతో నాలుగు రోజుల మ్యాచ్ ఆడేందుకు ఒక జట్టు ఇంగ్లండ్‌లోనే ఉంటుంది. కాబట్టి ఈ రెండు పర్యటనల్లో ఏ ఆటగాళ్లు భాగమవుతారో చూడాలి.

ఇక స్వదేశంలో (జూన్ 9 నుంచి 19 వరకు) జరిగే దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కి మరియు వచ్చే వారం ఐర్లాండ్, ఇంగ్లండ్‌ల పర్యటనకు భారత్ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. గత ఏడాది ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్‌ లో చివరి ఏకైక టెస్ట్‌ మ్యాచ్ కోవిడ్ కారణంగా నిలిచి పోయింది. దీంతో ఆ సిరీస్ ముగించేందుకు భారత టెస్ట్ జట్టు జూన్ 15 న ఇంగ్లాండ్ కి బయలుదేరే అవకాశం ఉంది.