Site icon HashtagU Telugu

Sachin stopped Sehwag: ధోనీ పక్కన పెడితే.. సచిన్ ఆపాడు.. మరో ఎనిమిదేళ్ల కెరీర్ ఆయన చలువే : సెహ్వాగ్

Virendra

Virendra Sehwag

వీరేంద్ర సెహ్వాగ్ తన కెరీర్ లోని ఒక కీలక దశకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. క్రికెట్ లో కొనసాగాలా ? వద్దా ? అనే పరిస్థితి ఎదురైన ఆ క్లిష్ట సమయంలో సెహ్వాగ్ ఎలా స్పందించారు అనేది తెలుసుకోవాలంటే ఈ కథనం మొత్తం చదవాల్సిందే. సెహ్వాగ్ కథనం ప్రకారం.. “అది 2008 సంవత్సరం.

ఆస్ట్రేలియా టూర్ కు ఇండియా టీమ్ వెళ్ళింది. అది ముక్కోణపు టోర్నీ. మొదటి నాలుగు వన్డే మ్యాచ్ లలో నేను పేలవంగా ఆడాను. ఆ నాలుగు మ్యాచ్ లలో నా స్కోర్ వరుసగా 6, 33, 11, 14. నాలుగో మ్యాచ్ 2008 ఫిబ్రవరి 24న జరిగింది. ఇక
ఐదో మ్యాచ్ నుంచి నేను ఆడకుండా ధోనీ ఆపేశారు.వన్డే టీమ్ నుంచి తీసేశారు. దీంతో ఇక నా వన్డే కెరీర్ ముగిసిపోయిందనే ఆలోచన మైండ్ లో వచ్చింది. ఇకపై టెస్ట్ క్రికెట్ మాత్రమే ఆడాల్సి రావచ్చని భావించాను. సరిగ్గా ఆ కష్ట కాలంలో నా కోసం ఒక గొంతు పలికింది. అతడే సచిన్ .” సెహ్వాగ్ ఇది నీ జీవితంలో చెడ్డ దశ. కాస్త ఓపిక పట్టు.

ఆస్ట్రేలియా టూర్ తర్వాత ఇంటికి వెళ్లి.. ప్రశాంతంగా ఆలోచించుకో. భవిష్యత్ లో ఏం చేయాలో డిసైడ్ చేసుకో” అని సచిన్ నాకు సూచించారు. దీంతో వెంటనే వన్డే ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాలనే ఆలోచనను వాయిదా వేసుకున్నాను. ఇంటికి వెళ్లి బాగా ఆలోచించుకొని… మళ్లీ పూర్వ శక్తితో ధాటిగా ఆడాలని డిసైడ్ అయ్యాను. తదుపరి గా ఇండియా టీమ్ లో దక్కిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకున్నాను. వన్డే, టీ20, టెస్టు ప్రతి ఫార్మాట్ లోనో ఇండియా టీమ్ కోసం మరో 8 ఏళ్ళు ఆడగలిగాను.” అని సెహ్వాగ్ వివరించారు. 2011 లో వన్డే వరల్డ్ కప్ ను గెలిచిన ఇండియా టీమ్ లోనూ తాను ఉన్నానని ఆయన గుర్తు చేశారు. సచిన్ మాటలు నింపిన ధైర్యం తో.. 2008 లో వన్డే సిరీస్ తర్వాత జరిగిన టెస్టు సిరీస్ లో తాను 150 రన్స్ చేశానని సెహ్వాగ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ కూడా అలాంటి దశలోనే ఉన్నాడని.. అతడి ఆటతీరుపై జరుగుతున్న ప్రచారానికి మైదానంలో జవాబు ఇస్తాడని వ్యాఖ్యానించారు.

Exit mobile version