Site icon HashtagU Telugu

Virender Sehwag: రీ ఎంట్రీకి రెడీ అయిన సెహ్వాగ్.. ఇక బౌలర్లకు దబిడి దిబిడే

Virender Sehwag

Virender Sehwag

Virender Sehwag: వీరేంద్ర సెహ్వాగ్…ఈ డాషింగ్ ఓపెనర్ పేరు వింటే చాలు ప్రత్యర్థి బౌలర్లకు గుండెల్లో దడే..క్రీజులో ఉన్నాడంటే బౌండరీలు, సిక్సర్ల వర్షమే.. తొలి బంతి నుంచే బంతిని కసితీరా బాదేసే సెహ్వాగ్ జట్టుకు ఎన్నోసార్లు మెరుపు ఆరంభాలను ఇచ్చాడు. భారత్‌ ఓపెనింగ్‌కు దూకుడు అలవాటు చేసిన వీరూ మళ్లీ మైదానంలోకి అడుగుపెడుతున్నాడు.

ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ అరంగేట్ర సీజన్‌లో బరిలోకి దిగేందుకు సెహ్వాగ్ ముంబై ఛాంపియన్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆటగాడిగానే కాకుండా ఈ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని సెహ్వాగ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ లో భాగమైనందుకు సంతోషిస్తున్నానని, ముంబై ఛాంపియన్స్ తరఫున బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు. ముంబై ఛాంపియన్స్‌కు మద్దతు తెలపండి. డెహ్రాడూన్‌లో కలుద్దాం అంటూ పోస్ట్ చేశాడు.ఐపీఎల్ తరహాలో దిగ్గజ క్రికెటర్లతో జరగనున్న ఐవీపీఎల్ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 3 వరకు డెహ్రాడూన్ వేదికగా జరగనుంది.

అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికి వెటరన్ ప్లేయర్లతో ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నారు. క్రిస్ గేల్, వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనా వంటి దిగ్గజ ఆటగాళ్లు ఈ లీగ్‌లో ఆడుతున్నారు. ఈ లీగ్‌లో మొత్తం 6 జట్లు పోటీపడనున్నాయి. రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, చత్తీస్‌గడ్ వారియర్స్, తెలంగాణ టైగర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రతీ జట్టులో నాలుగు నుంచి ఐదుగురు వరల్డ్ బెస్ట్ ప్లేయర్లు ఆడనున్నారు.

Also Read: Putnalu Pappu: ప్రతిరోజు పుట్నాల పప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?