Site icon HashtagU Telugu

Virender Sehwag: సీఎస్‌కే బౌలర్లపై సెహ్వాగ్ అసంతృప్తి.. అలా చేస్తే కెప్టెన్ ధోనీపై నిషేధం..!

Virender Sehwag

Resizeimagesize (1280 X 720) 11zon

సీఎస్‌కే బౌలర్లు (CSK Bowlers) ఎక్కువ మంది వైట్‌లు, నో బాల్‌లు వేసినందుకు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలాగే బౌలింగ్ చేస్తూ ఉంటే స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ ఎంఎం ధోనీపై నిషేధం పడే అవకాశం ఉందంటూ చెన్నై బౌలర్లను హెచ్చరించాడు. గణాంకాల ప్రకారం చూస్తే.. ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు చాలా అదనపు పరుగులు ఇచ్చారు. ఏప్రిల్ 17న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో CSK బౌలర్లు 11 అదనపు పరుగులు ఇచ్చారు. వాటిలో 6 వైడ్లు ఉన్నాయి.

ధోనీపై నిషేధం ఉండొచ్చు

CSK, RCB మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు ఇచ్చిన అదనపు పరుగుల సంఖ్యతో ధోనీ అసంతృప్తిగా ఉన్నాడు’ అని అన్నాడు. మళ్లీ మళ్లీ స్లో ఓవర్ రేట్ కారణంగా తమ స్ఫూర్తిదాయక కెప్టెన్‌పై నిషేధం విధించే అవకాశం ఉందని బౌలర్లను హెచ్చరించాడు. బౌలర్లు నో బాల్స్, వైడ్‌ల సంఖ్యను తగ్గించాలని సూచించాడు. RCBపై CSK మరో అదనపు ఓవర్‌ని బౌల్ చేసింది. కెప్టెన్ ధోనీపై నిషేధం విధించి కెప్టెన్ లేకుండానే జట్టును రంగంలోకి దించే స్థాయికి వెళ్లకూడదని అన్నాడు.

Also Read: RR vs LSG: ఐపీఎల్ లో నేడు మరో ఉత్కంఠ మ్యాచ్.. ఈ ఐదుగురు ఆటగాళ్లపైనే అందరి కళ్ళు..!

CSK బౌలర్లు వైడ్‌లు, నో బాల్‌లు వేస్తే ధోనీ విశ్రాంతి తీసుకోవలసి ఉంటుంది. ఐపీఎల్ 16వ సీజన్‌లో సీఎస్‌కే బౌలింగ్ బలహీనంగా ఉందని మాజీ క్రికెటర్ సెహ్వాగ్ పేర్కొన్నాడు. CSK బౌలర్లు సరైన లైన్‌లో బౌలింగ్ చేయాల్సి ఉంది. 30 బంతులు డాట్ ఆడిన తర్వాత కూడా RCB.. CSKపై 218 పరుగులు ఎలా చేసిందని అన్నారు. చెన్నై బౌలింగ్ బలహీనంగా ఉందని నేను మొదటి రోజు నుండి చెబుతున్నానని అన్నారు. గతంలో ధోనీ బౌలర్లకు వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని కూడా సెహ్వాగ్ గుర్తుచేశాడు.

అయితే.. బెంగళూరుతో మ్యాచ్ గురించి ఎంఎస్ ధోనీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ చేయడం కుర్రాళ్లకు సవాల్‌తో కూడుకున్నదే. వారు చాలా కష్టపడ్డారు.కాన్వే, దూబే ఇన్నింగ్స్‌లతో బెంగళూరు ముందు భారీ స్కోరు ఉంచగలిగాం.కానీ, డుప్లెసిస్,మాక్స్‌వెల్‌ ధాటిగా ఆడి మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చారు.వీరిద్దరూ అలానే కొనసాగి ఉంటే మ్యాచ్‌ను 18 ఓవర్లలోనే ముగించేవారు.చివరికి ఫలితం మాకు అనుకూలంగా రావడం ఆనందంగా ఉంది’’అని ధోనీ తెలిపాడు.