Site icon HashtagU Telugu

Virender Sehwag Predicts: అతనే ఈ T20 WCలో టాప్ స్కోరర్.. టీమిండియా ప్లేయర్స్ మాత్రం కాదు..!

Virendra

Virendra Sehwag

టీ20 ప్రపంచకప్ లో అసలు సమరం రేపటి నుంచి ప్రారంభం కానుంది. టీ20లలో బ్యాటర్లదే హవా. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ లపై బ్యాటర్లు పండుగ చేసుకోవడం ఖాయం. ఈ క్రమంలో ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసే బ్యాటర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది.

ప్రపంచ టీ20 క్రికెట్ లో ప్రస్తుత ఫామ్ ను బట్టి చూసుకుంటే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న పాకిస్థాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్, రెండో స్థానంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ తో పాటు టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ తో పాటు ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్, ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. అయితే.. ఈ టోర్నీలో వీళ్లెవరూ అత్యధిక పరుగులు చేయలేరని అంటున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఈ వరల్డ్ కప్ లో టాప్ స్కోరర్ గా ఉంటాడని జోస్యం చెప్పాడు సెహ్వాగ్.

బాబర్ ఆజం అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. విరాట్ కోహ్లి బ్యాటింగ్ చూస్తే ఆనందం కలిగినట్లు.. బాబర్ బ్యాటింగ్ కూడా ఆ ఫీలింగ్ కలిగిస్తుంది. బాబర్ ఆజం ఈ టోర్నీలో టాప్ స్కోరర్ గా ఉంటాడని వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. సెహ్వాగ్ అంచనాలు తరచూ నిజమవుతున్నాయి. మరి సెహ్వాగ్ అన్నట్టు బాబార్ టాప్ స్కోరర్ గా నిలుస్తాడో లేక ఆ స్థానంలో వేరే బ్యాటర్ ఉంటాడో చూడాలి..!

 

Exit mobile version