Site icon HashtagU Telugu

IPL 2023: రోహిత్ ప్లాప్ షోపై సెహ్వాగ్ ఆసక్తికర కామెంట్స్

IPL 2023

Ipl 2023 (1)

IPL 2023: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ‘మానసికతతో పోరాడుతున్నాడని, సాంకేతిక లోపంతో కాదని అన్నాడు భారత జట్టు మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో రోహిత్ శర్మ పరుగులు సాధించాలని తహతహలాడుతున్నాడని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లలో 18.39 సగటుతో మరియు 126.89 స్ట్రైక్ రేట్‌తో 184 పరుగులు చేశాడు. గత రెండు మ్యాచ్‌ల్లో ఖాతా కూడా తెరవలేకపోయాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పేరిట ఇబ్బందికర రికార్డు కూడా నమోదైంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డక్ ఔట్ అయిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో రోహిత్ శర్మ 16 సార్లు డక్ ఔట్ అయ్యాడు.

స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ లైవ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘రోహిత్ శర్మ ప్రస్తుతం బౌలర్లతో కాకుండా తనతో పోరాడుతున్నాడు. మానసిక సమస్య ఉందని, . అతని బ్యాటింగ్ టెక్నిక్‌లో ఎలాంటి లోపం లేదని, కానీ ఏదో ఒక రోజు రోహిత్ పాతవైభావాన్ని చూపిస్తాడని అభిప్రాయపడ్డాడు వీరేంద్ర సెహ్వాగ్.

ప్రస్తుత ఐపిఎల్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు అడగా అందులో ఐదు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ముంబై తన చివరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. కాగా ముంబై ఇండియన్స్‌కు టోర్నీ మధ్యలో ఎదురుదెబ్బ తగిలింది. ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతనికి ప్రత్యామ్నాయంగా ఆల్ రౌండర్ క్రిస్ జోర్డాన్‌ ఎంట్రీ ఇచ్చాడు. జోర్డాన్ రూ. 2 కోట్లకు ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసింది.

Read More: CBN : పంట బీమా కోసం, రైతు దీక్ష‌కు చంద్రబాబు.?