IND vs AUS: టీమిండియా చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్ అంతటి విధ్వంసకర ఓపెనర్ మరొకరు లేరు. బౌలింగ్ చేస్తుంది ఎవరైనా సరే, తనదైన స్టైల్‌లో వెల్‌కమ్ చెప్పడం అతనికి అలవాటు. ఫామ్‌లో ఉంటే అతన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఆరంభం నుంచే సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడుతూ బౌలర్లను మానసికంగా దెబ్బతీసేవాడు. అయితే వీరు కేవలం బ్యాటింగ్ లోనే కాకుండా బౌలింగ్ లోనూ విధ్వంసం సృష్టించగలడు.
ప్రపంచ క్రికెట్ చరిత్రలో బలమైన జట్టు ఆస్ట్రేలియా. హేమాహేమలతో నిండివుండే ఆ జట్టుపై సెహ్వాగ్ బంతితో విధ్వంసం సృష్టించాడు. గతంలో ఆస్ట్రేలియాపై జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి ఖంగారులను కంగారు పుట్టించాడు.2008లో దిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సెహ్వాగ్ బౌలింగ్ ప్రదర్శనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. మాత్యు హేడెన్ ను 83 పరుగుల వద్ద పెవిలియన్ పంపగా, రికీ పాంటిగ్ 87 పేరుగల వద్ద సెహ్వాగ్ కు చిక్కాడు. మైక్ హస్సి 53, షేన్ వాట్సాన్ 36 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. కామెరూన్ వైట్ 44 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఇలా ఆస్ట్రేలియాపై తన స్పిన్ మాయాజాలంతో 5 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు వీరేంద్ర సెహ్వాగ్.
Also Read: Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదు