VIrendra Sehwag: నాడు జహీర్, నెహ్రా..నేడు అర్ష్‌దీప్.. సెహ్వాగ్ కామెంట్రీ

వీరేంద్ర సెహ్వాగ్ అంటే.. గతంలో బ్లాస్టింగ్ బ్యాటింగ్ కు చిరునామా. ఇప్పుడు ఆయన క్రికెట్ పై అర్ధవంతమైన విశ్లేషణలకు దిక్సూచిగా మారారు.

  • Written By:
  • Publish Date - May 23, 2022 / 10:03 PM IST

వీరేంద్ర సెహ్వాగ్ అంటే.. గతంలో బ్లాస్టింగ్ బ్యాటింగ్ కు చిరునామా. ఇప్పుడు ఆయన క్రికెట్ పై అర్ధవంతమైన విశ్లేషణలకు దిక్సూచిగా మారారు. తాజాగా ఆయన అర్ష్‌దీప్ సింగ్‌ కు సంబంధించి చక్కటి విశ్లేషణ చేశారు. జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా వంటి భారత దిగ్గజ బౌలర్లతో అర్ష్‌దీప్‌ను పోల్చారు .

దక్షిణాఫ్రికా తో జరగబోయే సిరీస్‌కు భారత జట్టు తరఫున అర్ష్‌దీప్ సింగ్‌ ఎంపికైన నేపథ్యంలో సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ కింగ్స్ తరపున అర్ష్‌దీప్ డెత్‌ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌ చేశాడని ప్రశంసించారు. పెద్దగా వికెట్లు సాధించలేకపోయినా అతడి ఎకానమీ రేట్ అద్భుతంగా ఉందని సెహ్వాగ్ పేర్కొన్నారు.

” అతడు కొత్త బంతితో ఒక ఓవర్‌, స్లాగ్ ఓవర్లలో రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసే పేసర్‌. నేను ఆడేటప్పుడు జహీర్ ఖాన్,ఆశిష్ నెహ్రా మాత్రమే ఇలా బౌలింగ్‌ చేయడం చూశాను. ఇప్పుడు అర్ష్‌దీప్, బుమ్రా, భువనేశ్వర్ కూడా అఖరి ఓవర్లలో బాగా బౌలింగ్‌ చేస్తున్నారు. స్లాగ్ ఓవర్లలో బౌలింగ్ చేయడం చాలా కష్టం” అని సెహ్వాగ్ చెప్పారు. కాగా, ఐపీఎల్‌-2022లో 14 మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్ 10 వికెట్లు పడగొట్టాడు.