Virat Kohli: ఆసియా కప్ లో పాక్ పై కోహ్లీ వీరబాదుడు

ప్రపంచ కప్ కి ముందు ఆసియా కప్ ప్రారంభమైంది. పాకిస్థాన్ శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న ఆసియా కప్ లో పాక్ భారత్ 2సెప్టెంబర్ న హోరాహోరీ మ్యాచ్ జరగనుంది

Published By: HashtagU Telugu Desk
Virat Kohli

New Web Story Copy 2023 08 30t172518.494

Virat Kohli: ప్రపంచ కప్ కి ముందు ఆసియా కప్ ప్రారంభమైంది. పాకిస్థాన్ శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న ఆసియా కప్ లో పాక్ భారత్ 2సెప్టెంబర్ న హోరాహోరీ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆసియా కప్ చరిత్రలో ఓ మ్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

2012 లో బంగ్లాదేశ్ వేదికగా జరిగిన ఆసియాకప్‌లో కోహ్లీ వీరబాదుడు ఇంకా కళ్ళముందే మెదులుతుంది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు.148 బంతుల్లో 22 ఫోర్లు, సిక్సర్‌తో 183 భారీ స్కోర్ చేసి ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేశాడు. ఇప్పటికీ ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ టాప్‌లోనే కొనసాగుతున్నాడు. ఆసియాకప్‌లో విరాట్ కోహ్లీ ఆడిన 183 పరుగుల ఇన్నింగ్స్ అత్యుత్తమమైనది. పాకిస్థాన్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో 330 పరుగుల లక్ష్యచేధనలో కోహ్లీ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. తీవ్ర ఒత్తిడిలో తనదైన బ్యాటింగ్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఆ రోజు కింగ్ కోహ్లీ ఆడిన ఆ ఇన్నింగ్స్..అంతకుముందు ఆడిన గొప్ప ఇన్నింగ్స్‌లన్నిటినీ తుడిచి పెట్టేసింది. ఆసియా కప్‌లో ఇదే బెస్ట్ ఇన్నింగ్సని సగౌరవంగా చెప్పుకోవచ్చు.

Read More: Kuwait: షాపింగ్ మాల్ లో గొడవ పడిన వ్యక్తులు.. ఎటువంటి శిక్ష విధించారో తెలిస్తే నోరెళ్ళబెట్టాల్సిందే?

  Last Updated: 30 Aug 2023, 05:25 PM IST