Virat Kohli New Hairstyle: భారత్ తరఫున ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఇప్పుడు విరాట్ కోహ్లీ
(Virat Kohli New Hairstyle) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మొదటి ట్రోఫీని అందుకోవడంలో బిజీగా ఉన్నాడు. అయితే దీనికి ముందు తన లుక్‌ను మార్చుకున్నాడు. హెయిర్ స్టైల్ మార్చుకున్నాడు. కొత్త లుక్‌లో అదరగొట్టేస్తున్నాడు. ఈ లుక్‌లో కింగ్ కోహ్లీని చూసి అభిమానులు తమదైన కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా అతని మహిళా అభిమానులు అతన్ని చూసి తెగ సంబరపడిపోతున్నారు.
ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ ఆడేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈ లీగ్ ప్రారంభం కాకముందే కోహ్లీ కొత్త లుక్ ఇంటర్నెట్‌లో హల్చల్ చేసింది. అతని ఫోటోలు ప్రతిచోటా వైరల్ అవుతున్నాయి. అందులో అతను తన కొత్త హెయిర్‌స్టైల్‌లో తన లుక్‌ను చూపుతున్నాడు. అతని ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ భారత్ తరఫున చాలా ముఖ్యమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ టోర్నీలో అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారత్‌ను ఫైనల్స్‌కు చేర్చాడు. అతని బ్యాటింగ్ ముందు పెద్దపెద్ద బౌలర్లు కూడా విఫలమయ్యారు. ముఖ్యంగా సెమీఫైనల్ మ్యాచ్‌లో పాక్‌పై, ఆస్ట్రేలియాపై కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ ప్రశంసనీయం.
Also Read: Delhi Capitals: గత 17 ఏళ్లలో 14 మంది కెప్టెన్లను మార్చిన ఢిల్లీ క్యాపిటల్స్!
ఇప్పుడు విరాట్ కోహ్లి ఐపీఎల్‌లో అదరగొట్టడాన్ని చూడాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు. అక్కడ అతను తన జట్టు RCBకి మొదటి టైటిల్‌ను పొందడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. కోహ్లి కారణంగా RCBకి చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే, ఈసారి బెంగళూరు కమాండ్ రజత్ పాటిదార్ చేతిలో ఉంది.
ప్రస్తుతం కోహ్లీ చిన్న విరామంలో ఉన్నాడు. ఇప్పుడు అతను తన కుటుంబంతో గడుపుతున్నాడు. అయితే త్వరలో ఆర్సీబీ క్యాంపులో చేరనున్నాడు. బెంగళూరు అతన్ని 21 కోట్ల రూపాయలకు అంటిపెట్టుకుంది. ఈసారి అతను రజత్ పాటిదార్ కెప్టెన్సీలో ఆడనున్నాడు.