Vamika Kohli: భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన జంటలలో ఒకరైన విరాట్ కోహ్లీ- అనుష్క శర్మలకు జనవరి 11వ తేదీ ఎంతో ప్రత్యేకం. సరిగ్గా ఇదే రోజున వారు మొదటిసారి తల్లిదండ్రులయ్యారు. అనుష్క శర్మ ఒక ఆడపిల్లకు జన్మనివ్వగా, ఆ పాపకు వారు ‘వామికా’ అని పేరు పెట్టారు. ఈరోజు వామికా కోహ్లీ తన 5వ పుట్టినరోజును జరుపుకుంటోంది.
వామికా జననం, ప్రైవసీ
వామికా కోహ్లీ జనవరి 11, 2021న ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో జన్మించింది. ప్రపంచ స్థాయి స్టార్ క్రికెటర్ తండ్రి కావడంతో ఈ వార్త అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశం నలుమూలల నుండి వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే విరాట్- అనుష్క మొదటి నుండీ తమ కుమార్తె ప్రైవసీని కాపాడుతూ వస్తున్నారు. పాప ఫోటోలు తీయవద్దని, సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని వారు మీడియాను, అభిమానులను కోరారు.
Also Read: ఆవనూనె స్వచ్ఛతను గుర్తించండిలా?!
‘వామిక’ పేరు వెనుక ఉన్న అర్థం
విరాట్-అనుష్క తమ కుమార్తెకు ఈ పేరును ఎంతో ప్రత్యేకమైన కారణంతో ఎంచుకున్నారు. వామిక అనే పేరు హిందూ పురాణాల నుండి తీసుకోబడింది. ఇది దుర్గామాత మరొక రూపంగా పరిగణించబడుతుంది. శివుని సౌమ్య రూపమైన ‘వామదేవుడి’ నుండి కూడా ఈ పేరు ప్రేరణ పొందింది. శివునిలో సగభాగమైన పార్వతీ దేవిని (అర్ధనారీశ్వర రూపం) సూచిస్తూ శరీరంలోని ఎడమ (వామ) భాగంలో అమ్మవారు ఉంటారు కాబట్టి ఆమెను ‘వామిక’ అని పిలుస్తారు.
Also Read: రోహిత్, విరాట్‌లపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు!
2024లో రెండోసారి తండ్రిగా కోహ్లీ
అనుష్క శర్మ ఫిబ్రవరి 15, 2024న మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ బాబుకు ‘అకాయ్’ అని పేరు పెట్టారు. విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్‌కు షిఫ్ట్ అయ్యారని కొన్ని నివేదికలు చెబుతున్నప్పటికీ ప్రస్తుతం కోహ్లీ భారత్‌లోనే ఉన్నారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌లో ఆయన టీమ్ ఇండియాలో భాగంగా ఆడుతున్నారు.
