Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో విరాట్ కోహ్లీ (Virat Kohli) స్థిరత్వం ఒక బెంచ్‌మార్క్‌గా నిలుస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తరపున 2008 నుంచి ఆడుతున్న కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు (8,509) సాధించిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. 263 మ్యాచ్‌లలో 39.58 సగటు, 132.6 స్ట్రైక్ రేట్‌తో అతని ప్రదర్శన స్థిరత్వానికి నిదర్శనం.
ఐపీఎల్‌లో కోహ్లీ రికార్డులు
కోహ్లీ ఐపీఎల్‌లో 8 సెంచరీలు, 62 అర్ధ సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. 2016 సీజన్‌లో 973 పరుగులతో ఒకే సీజన్‌లో అత్యధిక పరుగుల రికార్డు నెలకొల్పాడు. ఆ సీజన్‌లో 81.08 సగటుతో నాలుగు సెంచరీలు సాధించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఆరెంజ్ క్యాప్‌ను 2016, 2024 సీజన్‌లలో గెలుచుకున్న అతను ఎనిమిది సీజన్‌లలో 500+ పరుగులు సాధించి మరో రికార్డు నమోదు చేశాడు. 2025 సీజన్‌లో 11 మ్యాచ్‌లలో 505 పరుగులు, 63.13 సగటు, ఏడు అర్ధ సెంచరీలతో ఆరెంజ్ క్యాప్ రేసులో ముందున్నాడు.
Virat Kohli's consistency in the IPL. 🤯 pic.twitter.com/7W9YW3j5dG
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 17, 2025
కోహ్లీ ప్రతి మ్యాచ్‌ను వరల్డ్ కప్ ఫైనల్‌గా భావిస్తాడు. అతని ఫిట్‌నెస్, టెక్నికల్ డిసిప్లిన్ అతన్ని ఐపీఎల్‌లో అజేయంగా నిలిపాయి. గత 19 ఇన్నింగ్స్‌లలో కేవలం ఒక్కసారి మాత్రమే సింగిల్ డిజిట్ స్కోర్‌కు పరిమితమైన కోహ్లీ.. 2025లో విజయవంతమైన మ్యాచ్‌లలో 95 సగటున పరుగులు సాధించాడు. సామాజిక మాధ్యమాల్లో అతని స్థిరత్వంపై ప్రశంసలు కురుస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్‌పై 10 50+ స్కోర్లు సాధించి ప్రత్యర్థులపై తన ఆధిపత్యాన్ని చాటాడు.
Also Read: Babar Azam’s World XI: బాబర్ ఆజం టీ20 వరల్డ్ జట్టు ఇదే.. కోహ్లీ, బుమ్రాలకు షాక్!
2008 నుంచి ఆర్‌సీబీ తరపున ఆడుతున్న కోహ్లీ.. ఫ్రాంచైజీకి అతని విధేయతను నిరూపించాడు. అయితే ఆర్‌సీబీ ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ గెలవకపోవడం అభిమానులను నిరాశపరుస్తోంది. అయినప్పటికీ కోహ్లీ ప్రదర్శనలు జట్టుకు బలమైన స్తంభంగా నిలుస్తున్నాయి. అతని నాయకత్వంలో ఆర్‌సీబీ 2016లో ఫైనల్‌కు చేరినప్పటికీ టైటిల్ కల నెరవేరలేదు. విరాట్ కోహ్లీ స్థిరత్వం, అతని ఆటతీరు ఐపీఎల్‌లో ఒక లెజెండ్‌గా నిలిపాయి. 2025 సీజన్‌లోనూ అతని బ్యాట్ అద్బుతంగా పరుగులు రాణిస్తోంది.