Virat Kohli Wishes Anushka: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ప్రముఖ నటి అనుష్క శర్మ జంట అత్యంత ఆదరణీయ జంటలలో ఒకటిగా నిలిచింది. వీరిద్దరి సంబంధం సంవత్సరాలుగా చాలా బలంగా ఉంది. అనుష్క శర్శ జన్మదినం సందర్భంగా విరాట్ (Virat Kohli Wishes Anushka) ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రత్యేక పోస్ట్ షేర్ చేస్తూ ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపాడు. తన భార్య అనుష్క శర్మ గురించి విరాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “అనుష్క కేవలం భార్య మాత్రమే కాదు. నా బెస్ట్ ఫ్రెండ్, జీవిత భాగస్వామి, ఆమే నాకు అన్నీ” అని రాసుకొచ్చాడు. అనుష్క ఎల్లప్పుడూ విరాట్‌కు బలమైన సహాయంగా నిలిచింది. ఈ జంటకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు. కుమార్తె వామికా, కుమారుడు అకాయ్ ఉన్నారు. అనుష్క 37వ జన్మదినం సందర్భంగా విరాట్, అనుష్కా తమ కుటుంబాన్ని పూర్తి చేస్తుందని, తన జీవితంలో మార్గదర్శిగా ఉందని చెప్పాడు.
జన్మదిన శుభాకాంక్షలు ఇలా తెలిపాడు
విరాట్ గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాశాడు. “నా బెస్ట్ ఫ్రెండ్, జీవిత భాగస్వామి, నా అత్యంత ప్రియమైన వ్యక్తి, నా ప్రపంచం. నీవు మా జీవితంలో వెలుగు. మేము ప్రతి రోజూ నిన్ను చాలా ప్రేమిస్తాము. జన్మదిన శుభాకాంక్షలు, నా ప్రియతమా.” అంటూ రాసుకొచ్చాడు.
Also Read: Fastest UPI : జూన్ 16 నుంచి యూపీఐ లావాదేవీలు మరింత స్పీడ్.. ఎందుకు ?
ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇప్పటివరకు అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అతను 63.28 సగటుతో 443 పరుగులు సాధించాడు. 10 ఇన్నింగ్స్‌లలో 6 అర్ధసెంచరీలు సాధించాడు. అతను ఆరెంజ్ క్యాప్ రేసులో రెండవ స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు బీ. సాయి సుదర్శన్ ఉన్నాడు. సాయి 9 ఇన్నింగ్స్‌లలో 456 పరుగులు సాధించాడు.
మరోవైపు, విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్ వల్ల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కు కూడా ప్రయోజనం లభించింది. జట్టు ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు గెలిచి 14 పాయింట్లతో పాయింట్ల టేబుల్‌లో అగ్రస్థానంలో ఉంది. వారి తదుపరి మ్యాచ్ మే 3న ఎం. చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగనుంది. RCB ఈ మ్యాచ్ గెలిచినట్లయితే మూడుసార్లు ఫైనల్‌కు చేరుకున్న ఈ జట్టు ప్లేఆఫ్‌లో స్థానాన్ని ఖరారు చేసుకుంటుంది.