ఐపీఎల్ 2026.. 9 వేల పరుగుల ముంగిట విరాట్‌ కోహ్లీ!!

ఐపీఎల్ (IPL) కొత్త సీజన్ మార్చి 28 నుండి ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య జరగనుంది.

Published By: HashtagU Telugu Desk
Virat Kohli

Virat Kohli

Virat Kohli: ఐపీఎల్ (IPL) కొత్త సీజన్ మార్చి 28 నుండి ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య జరగనుంది. ఈసారి కూడా టైటిల్‌ను నిలబెట్టుకోవాలని ఆర్‌సీబీ గట్టి పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు విరాట్ కోహ్లీపైనే ఉన్నాయి. ఈ సీజన్‌లో కోహ్లీ ఒక భారీ మైలురాయిని అధిగమించే అవకాశం ఉంది. సాధారణంగా విరాట్ మైదానంలోకి అడుగుపెడితే చాలు రికార్డులు వాటంతట అవే నమోదవుతుంటాయి. ఈ సీజన్‌లో ఆయన మరో 339 పరుగులు చేస్తే ఇప్పటి వరకు ఎవరూ సాధించని ఒక ‘మహారివార్డు’ను తన పేరిట లిఖించుకుంటారు.

9 వేల పరుగుల ముంగిట కోహ్లీ

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ బ్యాటర్ కూడా 9 వేల పరుగుల మార్కును అందుకోలేదు. ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీకి ఈ అద్భుతమైన కీర్తిని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో కోహ్లీ ఇప్పటివరకు ఆడిన 267 మ్యాచ్‌ల్లో 8661 పరుగులు చేశారు. ఇందులో 8 సెంచరీలు, 63 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్‌లో కోహ్లీ కనీసం 14 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. అందులో మరో 339 పరుగులు సాధిస్తే ఐపీఎల్‌లో 9 వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తారు.

Also Read: ఎల్‌పీజీ సిలిండర్ ఏటీఎం.. ఇది ఎలా ప‌నిచేస్తుంది?

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు విరాట్ పేరిటే..

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరు మీద ఉంది. ఈ జాబితాలో రెండో స్థానంలో రోహిత్ శర్మ ఉన్నారు. రోహిత్ శర్మ ఇప్పటికే 7 వేలకు పైగా పరుగులు చేసి, 7 సెంచరీలు కూడా బాదారు. గత మూడు సీజన్లుగా విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో పరుగుల వరద పారిస్తున్నారు.

2023లో: 53.25 సగటుతో 639 పరుగులు.

2024లో: 61.75 సగటుతో 741 పరుగులు.

గత సీజన్‌లో: 657 పరుగులు.

ఈ గణాంకాలను చూస్తుంటే ఈసారి కూడా కోహ్లీ నుండి అభిమానులు అద్భుతమైన ప్రదర్శనను ఆశిస్తున్నారు.

  Last Updated: 18 Mar 2026, 08:24 PM IST