Virat Kohli vs Sachin Tendulkar: విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ (Virat Kohli vs Sachin Tendulkar).. ఇద్దరూ భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా గుర్తిస్తారు. సచిన్ టెండూల్కర్ తర్వాత భారత జట్టు స్టార్ బాయ్ స్థానాన్ని విరాట్ కోహ్లీ స్వీకరించారు. విరాట్, సచిన్ ఇద్దరూ వన్డే క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. అందుకే వన్డే క్రికెట్ అసలు కింగ్ ఎవరు? అనే పోలిక ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు ఈ వాద వివాదానికి సునీల్ గవాస్కర్ ముగింపు పలికి, తన అభిప్రాయం ప్రకారం వన్డే క్రికెట్‌లో గొప్ప ఆటగాడు ఎవరో తెలిపారు.
విరాట్ సెంచరీపై గవాస్కర్ ఏమన్నారు?
రాంచీ వన్డేలో విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్‌లో 52వ సెంచరీ సాధించారు. దీని గురించి సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. “నాకు మాత్రమే కాదు. విరాట్ కోహ్లీతో ఆడిన లేదా అతనికి వ్యతిరేకంగా ఆడిన ఎవరైనా సరే అతను వన్డే ఫార్మాట్‌లో అత్యంత గొప్ప ఆటగాడు అని అంగీకరిస్తారు” విరాట్ కోహ్లీ ఇన్ని సెంచరీలు సాధించడంతో అతను ఇప్పుడు అగ్రస్థానానికి చేరుకున్నాడని గవాస్కర్ అన్నారు.
Also Read: Telangana Rising Global Summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు పీఎం మోదీ, రాహుల్ గాంధీ?!
విరాట్ లేదా సచిన్, ODIలో గొప్ప బ్యాట్స్‌మెన్ ఎవరు?
ఇటీవల ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ కూడా విరాట్ కోహ్లీని వన్డే చరిత్రలోనే గొప్ప ఆటగాడిగా అభివర్ణించారు. దీనిని ప్రస్తావిస్తూ సునీల్ గవాస్కర్ ఇలా అన్నారు. “ఒక ఆస్ట్రేలియన్ నుండి ప్రశంసలు పొందడం చాలా అరుదు. అందుకే ఒక ఆస్ట్రేలియన్ కోహ్లీ అత్యుత్తమం అని చెబితే దానిపై చర్చకు తావు లేదు. సచిన్ టెండూల్కర్ ఇన్ని సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నారు. మీరు ఆయన్ని అధిగమించినప్పుడు మీరు ఏ స్థాయిలో ఉన్నారో మీకు తెలుస్తుంది. మీరు అగ్రస్థానంలో దాదాపు ఒంటరిగా ఉన్నట్లే” అని తెలిపారు.
రాంచీ వన్డే హీరో విరాట్ కోహ్లీ
రాంచీ వన్డేలో విరాట్ కోహ్లీ తన బ్యాట్‌తో సత్తా చాటారు. ఆరంభం నుంచీ అద్భుతమైన ఫామ్‌లో కనిపించి, పెద్ద పెద్ద షాట్లు ఆడారు. సౌత్ ఆఫ్రికాపై ఈ మ్యాచ్‌లో కోహ్లీ 120 బంతుల్లో 135 పరుగులు చేశారు. ఈ ఇన్నింగ్స్‌లో 112.50 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి 7 సిక్స్‌లు, 11 ఫోర్లు కొట్టారు. ఈ ప్రదర్శనకే విరాట్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
