Site icon HashtagU Telugu

RCB Success: కోహ్లీ ప్లేయర్స్ ను మార్చేవాడు..డూప్లెసిస్ ఆర్సీబీ ఆలోచనల్లో మార్పు తెచ్చాడు: సెహ్వాగ్

RCB Playoffs

Rcb Virat

IPLలో వరుసగా రెండోసారి రాయల్ ఛాలెంజర్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ లో చోటు దక్కించుకుంది. లక్నో జట్టుతో ఇవాళ పోటీ పడనుంది. ఫైనల్ కు చేరుకోవాలంటే లక్నో జట్టుతోపాటు…రాజస్తాన్ జట్టను ఓడించాల్సిందే. కానీ గతంతో పోల్చితే…ఆర్సీబీ జట్టు కాస్త నిలకడగా…బలాన్ని ప్రదర్శిస్తోంది. IPL2022 సీజన్ లో ఆర్సీబీ మంచి పనితీరు కనబర్చడం వెనక కొత్త కోచ్ ఫాప్ డూప్లెసిస్, కోచ్ సంజయ్ బంగర్ ప్రధాన కారణంగా మాజీ క్రికెటర్ సెహ్వాగ్ చెప్పుకొచ్చారు.

గత సీజన్ వరకు ఆర్సీబీకి కెప్టెన్ గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ తరచూ ప్లేయర్స్ ను మార్చుతుండేవాడని సెహ్వాగ్ గుర్తు చేశాడు. ఆటగాళ్లు రెండు మూడు మ్యాచుల్లో సరిగ్గా ఆడలేకపోతే…వారిని ఎలిమినేట్ చేసేవాడని తెలిపాడు. ఫాఫ్, బంగర్ ఆర్సీబీ జట్టులో ఎంతో నిలకడగా తీసుకొచ్చారని పేర్కొన్నాడు. జట్టుకు ఇది ఎంతో మేలు చేస్తుందని అభిప్రాయపడ్డాడు.

హెడ్ కోచ్ సంజయ్ బంగర్, కొత్త కెప్టెన్ డూప్లిసిస్ ఆర్సీబీ ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చారు. ఒక ప్లేయర్ 2-3మ్యాచుల్లో సరిగ్గా ఆడకపోతే..అతన్ని కోహ్లీ ఎలా తప్పించేవాడో చూశాం. కానీ బంగర్ డూప్లెసిస్ స్థిరత్వాన్ని తీసుకొచ్చారు. పటిదార్, అనూజ్ రావత్ మినహా జట్టులోని ఇతర ఆటగాళ్లు రాణించలేకపోయినా మార్చలేదన్న విషయాన్ని సెహ్వాగ్ వివరించాడు.