Site icon HashtagU Telugu

WI vs IND 2nd ODI: వాటర్ బాయ్‌గా కింగ్ కోహ్లీ

WI vs IND

New Web Story Copy 2023 07 31t010104.455

WI vs IND 2nd ODI: ప్రపంచ క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ పేరు చిరస్థాయిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. తన సుదీర్ఘ క్రికెట్ జీవితంలో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో ఆపద్బాంధవుడిగా వచ్చి మరుపురాని విజయాల్ని అందించాడు. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం విరాట్ సొంతం. అట విషయంలో దూకుడుగా ఉండొచ్చు కానీ చేతల విషయంలో కోహ్లీ ఎప్పటికీ ఆదర్శంగానే నిలుస్తాడు.

టీమిండియా ప్రస్తుతం కరేబియన్ గడ్డపై మూడు వన్డేల సిరీస్ లో ఆడుతుంది. మొదటి వన్డేలో విండీస్ పై విజయం సాధించిన భారత్ రెండో వన్డేలో ఓడింది. అయితే ఈ మ్యాచ్ లో కోహ్లీ బెంచ్ కి పరిమితమయ్యాడు. జూనియర్లకు జట్టులో స్థానం కల్పిస్తూ కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ డగౌట్ లో కూర్చున్నారు. కాగా మ్యాచ్ డ్రింక్ బ్రేక్ లో కోహ్లీ మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నాడు.

విండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో డగౌట్ లో ఖాళీ గా కూర్చున్న కింగ్.. డ్రింక్స్ బాయ్ అవతారమెత్తాడు. రిజర్వ్ ప్లేయర్లు వేసుకునే ప్రత్యేక జెర్సీ ధరించి సహచరులకు నీళ్లు, అరటిపండ్లు మోసుకుంటూ మైదానంలోకి వచ్చాడు. కోహ్లీతో పాటు చాహల్ కూడా ఉన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అభిమానులు మాత్రం కోహ్లీ సింప్లిసిటీకిని తెగ మెచ్చుకుంటున్నారు. దటీజ్ కోహ్లీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: Zim Afro T10: జింబాబ్వే టీ10 లీగ్ విజేత డర్బన్