Site icon HashtagU Telugu

Virat Kohli: విరాట్‌ కోహ్లి పేరిట మరో రికార్డు.. అత్యధిక సేపు క్రీజులో బ్యాటింగ్‌ చేసిన బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ..!

Virat Kohli

Virat Kohli

Virat Kohli: 2023 ప్రపంచకప్‌లో అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తూ విరాట్‌ కోహ్లి (Virat Kohli) తన పేరిట ఎన్నో రికార్డులు సృష్టించాడు. వన్డే ఫార్మాట్‌లో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు సాధించిన ఆటగాడిగా కోహ్లీ సచిన్ టెండూల్కర్‌ను సమం చేశాడు. దీంతో పాటు కోహ్లీ పేరిట మరో ప్రత్యేక రికార్డు నమోదైంది. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక సేపు క్రీజులో బ్యాటింగ్‌ చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

మీడియా కథనాల ప్రకారం.. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు విరాట్ బ్యాటింగ్ కోసం క్రీజులో దాదాపు 14 గంటల 39 నిమిషాలు గడిపాడు. ఈ విషయంలో మిగతా భారత ఆటగాళ్లు చాలా వెనుకబడ్డారు. రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ 8 గంటల 23 నిమిషాలు గడిపాడు. కేఎల్ రాహుల్ మూడో స్థానంలో ఉన్నాడు. అతను 7 గంటల 20 నిమిషాలు గడిపాడు. శ్రేయాస్ అయ్యర్ నాలుగో స్థానంలో, శుభమాన్ గిల్ ఐదో స్థానంలో ఉన్నారు. అయ్యర్ 6 గంటల 29 నిమిషాలు గడిపారు. కాగా గిల్ 5 గంటల 52 నిమిషాలు గడిపాడు.

Also Read: Glenn Maxwell: మాక్స్‌వెల్ కాళ్లు కదపకుండా సిక్స్‌లు ఎలా కొట్టాడు..?.. కారణమిదేనా..?

2023 ప్రపంచకప్‌లో కోహ్లీ ప్రదర్శన గురించి మాట్లాడుకుంటే.. రెండు సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు చేశాడు. దక్షిణాఫ్రికాపై కోహ్లి 101 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాదేశ్‌పై అజేయంగా 103 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌పై కోహ్లీ 95 పరుగులు చేశాడు. శ్రీలంకపై 88 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆస్ట్రేలియాపై 85 పరుగులకే ఔటయ్యాడు. ఆఫ్ఘనిస్థాన్‌పై అజేయంగా 55 పరుగులు చేశాడు.

We’re now on WhatsApp. Click to Join.

టీమ్ ఇండియా సెమీఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా కూడా సెమీఫైనల్‌కు చేరాయి. ప్రపంచ కప్ 2023 మొదటి సెమీ-ఫైనల్ నవంబర్ 15న, రెండవ సెమీ-ఫైనల్ నవంబర్ 16న జరుగుతుంది. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.