Site icon HashtagU Telugu

IND vs AFG T20I series: ఆఫ్ఘానిస్తాన్ తో తొలి టి20 మ్యాచ్ కు కోహ్లీ దూరం.. రీజన్ ఇదే.. !

IND vs AFG T20I series

IND vs AFG T20I series

IND vs AFG T20I series: సౌతాఫ్రికా సిరీస్ ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన భారత్ రేపటినుండి ఆఫ్ఘానిస్తాన్ తో జరిగే మూడు టి20 ల సిరీస్ ఆడనుంది. రేపు పంజాబ్‌లోని మొహాలీలో తొలి టి20 మ్యాచ్ జరుగుతుంది. అయితే అనూహ్యంగా జట్టు నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవాల్సి వచ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ స్టార్ క్రికెటర్ తొలి మ్యాచ్ ఆడటం లేదు.

రేపు టీమిండియాతో ఆఫ్ఘానిస్తాన్ తొలి టి20 మ్యాచ్ ఆడబోతుంది. మ్యాచ్ కు ముందు కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ రోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ వ్యక్తిగత కారణాల నేపథ్యంలో విరాట్ కోహ్లీ తొలి టి20 మ్యాచ్ కు దూరం కాబోతున్నాడని పేర్కొన్నాడు. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్‌తో కలిసి భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్ కు దిగుతాడని ద్రవిడ్ అన్నాడు.

అంతకుముందు జనవరి 7న అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ (BCCI) ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే టి20 అంతర్జాతీయ సిరీస్ కోసం టీమ్ ఇండియా జట్టును ప్రకటించారు. ఇదివరకు ప్రకటించిన జాబితాలో కెప్టెన్ రోహిత్ శర్మ మరియు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉన్నారు. దాదాపు 14 నెలల తర్వాత ఈ స్టార్ ఆటగాళ్లు టి 20 ఫార్మేట్ లోకి అడుగు పెడుతున్నారు. గతేడాది టి20 ప్రపంచకప్ తర్వాత రోహిత్, విరాట్ మరే టి20 మ్యాచ్ ఆడలేదు. అంతకుముందు భారత స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా మరియు మహ్మద్ సిరాజ్‌లకు విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు నిర్ణయించారు.

భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య తొలి టీ20 జనవరి 11న మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో, రెండో టీ20 జనవరి 14న ఇండోర్‌లో, చివరి మ్యాచ్ జనవరి 17న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.

ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్: టీమ్ ఇండియా స్క్వాడ్
రోహిత్ శర్మ (సి), ఎస్ గిల్, వై జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్), సంజు శాంసన్ (వికె), శివమ్ దూబే, డబ్ల్యూ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ , అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

Also Read: Chandrababu: పేదలు సంక్రాంతి పండగను కూడా చేసుకోలేని పరిస్థితి: చంద్రబాబు నాయుడు