Site icon HashtagU Telugu

Captain Virat Kohli: బీసీసీఐ న‌యా ప్లాన్.. విరాట్ కోహ్లీకి మళ్లీ టెస్టు కెప్టెన్సీ దక్కుతుందా?

Team India

Team India

Captain Virat Kohli: భారత్, ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌ల T20 సిరీస్ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మూడు మ్యాచ్‌ల ODI సిరీస్ ఆడుతోంది. వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా 1-0తో సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్‌తో సిరీస్ తర్వాత, టీమ్ ఇండియా ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆడాల్సి ఉంది. అయితే దీనికి ముందు బీసీసీఐ ఒక ప్రణాళికను సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. బీసీసీఐ ప్లాన్ ప్రకారం.. ప్రతి మూడు ఫార్మాట్లలో వేర్వేరు కెప్టెన్లు (Captain Virat Kohli) ఉంటారని తెలుస్తోంది.

గతంలో మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్‌గా ఉండాలని బీసీసీఐ నిర్ణయించింది. అయితే ఇప్పుడు బోర్డు అందులో మార్పులు చేయవచ్చ‌ని స‌మాచారం. T20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ రిటైర్ అయ్యాడు. ఆపై బోర్డు సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా చేసింది. వన్డే, టెస్టుల్లో రోహిత్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే ఇప్పుడు మూడు ఫార్మాట్లలో వేర్వేరు కెప్టెన్లను నియ‌మించేందుకు బోర్డు సన్నాహాలు చేస్తోంది.

Also Read: Suryakumar Yadav: 2,0,14,12, 0, 9.. గ‌త‌న ఆరు ఇన్నింగ్స్‌ల్లో సూర్య‌కుమార్ చేసిన ప‌రుగులివే!

BCCI అధికారి ఒక‌రు క్రిక్‌బ్లాగర్‌తో మాట్లాడుతూ.. టీమిండియా త్వరలో మూడు ఫార్మాట్‌లకు ముగ్గురు కెప్టెన్‌లను పొందబోతోంది. కెప్టెన్‌ల పనితీరును చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ రకమైన పరివర్తన దశ వ్యవస్థకు చాలా సున్నితంగా ఉంటుంది. కానీ బోర్డు దానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

విరాట్‌, హార్దిక్‌లు కెప్టెన్‌లుగా మారవచ్చు

నివేదిక ప్రకారం.. విరాట్ కోహ్లీని మరోసారి టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా నియమించాలని ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కోరుతున్నట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ మళ్లీ టెస్టు జట్టుకు సారథ్యం వహిస్తాడా? లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే హార్దిక్ పాండ్యా వన్డే క్రికెట్‌లో జట్టుకు కెప్టెన్‌గా మారవచ్చ‌ని స‌మాచారం. ఛాంపియన్స్ ట్రోఫీకి హార్దిక్‌ను వైస్ కెప్టెన్‌గా చేయాలని గంభీర్ కోరినట్లు నివేదిక పేర్కొంది. కానీ సెలక్టర్లు, రోహిత్ శర్మ దానిని తిరస్కరించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.