RCB captain: ఫాఫ్ డు ప్లెసిస్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరి ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఆరంభ మ్యాచ్ ల్లో తడబడ్డ ఆ జట్టు గతా ఐదు మ్యాచ్ ల్లో గెలిచి విమర్శకుల నోళ్లు మూయించింది. దీంతో ఈ జట్టు ప్లేఆఫ్ రేసులో కొనసాగుతోంది. ఆర్సీబీ చివరి మ్యాచ్ ల్లో ఢిల్లీపై విజయం సాధించింది.
ఆర్సీబీ వరుస విజయాలతో దూసుకెళ్తుండటంతో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ భిన్నమైన వాదనలను తెరపైకి తీసుకొచ్చాడు. వర్కౌట్ అవుతుందో లేదో పక్కనపెడితే హర్భజన్ చేసిన కామెంట్స్ పై కోహ్లీ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. కోహ్లిని మళ్లీ కెప్టెన్‌గా చేయాలని ఆర్సీబీ మేనేజ్‌మెంట్ ని కోరాడు హర్భజన్ సింగ్. 2013లో కోహ్లి ఆర్‌సీబీ కెప్టెన్సీని చేపట్టాడు. 2021 వరకు జట్టుకు సారధిగా వ్యవహరించాడు. 2022లో ఆర్సీబీకి డుప్లెసిస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అయితే తాజాగా స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడిన హర్భజన్ సింగ్ విరాట్ కోహ్లీని మళ్లీ కెప్టెన్‌గా ఎందుకు చేయకూడదు? చెన్నై సూపర్ కింగ్స్‌పై ఎంఎస్ ధోని ప్రభావం చాలా ఉంది. అలాగే విరాట్ కోహ్లీ ప్రభావం ఆర్సీబీపై కచ్చితంగా ఉందన్నాడు బజ్జి .ఇప్పుడు ఆర్సీబీ దూకుడుగా ఆడుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ విరాట్ కోహ్లినే జట్టుకు సారథ్యం వహించాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు హర్భజన్.
ఈ సీజన్ ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో కోహ్లీ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడి 661 పరుగులు చేశాడు. అందులో ఐదు అర్ధ సెంచరీలు మరియు ఒక సెంచరీ ఉన్నాయ్. ఈ ఏడాది కోహ్లి సగటు 66.10 మరియు స్ట్రైక్ రేట్ 155.16. ఈ సీజన్‌లో కోహ్లీ తర్వాత రెండో స్థానంలో రితురాజ్ గైక్వాడ్ 13 మ్యాచ్‌ల్లో 583 పరుగులు చేశాడు.
Also Read: Team India: టీమిండియా టీ20 ప్రపంచ కప్‌లో రాణించగలదా..?