Site icon HashtagU Telugu

Virat Kohli: విరాట్ కోహ్లీ ముందు మ‌రో అరుదైన రికార్డు.. 92 ర‌న్స్ చాలు..!

Virat Kohli Record

Virat Kohli Record

Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన అద్భుత బ్యాటింగ్‌తో రికార్డులు సృష్టిస్తున్నాడు. కోహ్లీ మైదానంలోకి రాగానే భిన్నమైన వాతావరణం ఏర్పడుతుంది. అతని స్టైలిష్ బ్యాటింగ్ అభిమానులను థ్రిల్ చేస్తుంది. కోహ్లి ఇప్పటి వరకు ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అతని అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా టీ-20 ప్రపంచకప్ ఫైనల్‌లోనూ టీమిండియా విజయం సాధించింది. ఇప్పుడు అతను శ్రీలంకతో వ‌న్డే సిరీస్‌లో భాగ‌మ‌య్యాడు. తొలి వన్డేలో అతని బ్యాట్ నుంచి 32 బంతుల్లో 2 ఫోర్లతో 24 పరుగులు చేసి ఔటైనా.. ఇప్పుడు ఓ రికార్డును టార్గెట్ చేయనున్నాడు. దీన్ని సాధించడం ద్వారా కోహ్లీ చరిత్ర సృష్టించే అవ‌కాశం ఉంది. ఇంతకీ ఆ రికార్డు ఏంటో తెలుసుకుందాం.

27 వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు

నిజానికి ఇప్పటివరకు విరాట్ కోహ్లీ 113 టెస్టు మ్యాచ్‌ల్లో 8848 పరుగులు, 293 వన్డేల్లో 13872 పరుగులు, 125 టీ20 మ్యాచ్‌ల్లో 4188 పరుగులు చేశాడు. ఈ విధంగా విరాట్ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో 531 మ్యాచ్‌లలో 589 ఇన్నింగ్స్‌లలో 26908 పరుగులు చేశాడు. 27 వేల పరుగుల ఫిగర్‌ను అందుకోవడానికి కోహ్లీ 92 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. ఈ పరుగులు సాధిస్తే ప్రపంచంలోనే అత్యంత వేగంగా 27,000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కుతాడు. దీంతో 27 వేల పరుగుల ఫిగర్‌ను అందుకున్న ప్రపంచంలోనే నాలుగో బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించనున్నాడు.

Also Read: PNB Account Holders: కస్టమర్లను హెచ్చరించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్.. ఆగస్టు 12 వరకే ఛాన్స్..!

సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకు ముగ్గురు బ్యాట్స్‌మెన్ మాత్రమే 27 వేల పరుగులను అధిగమించారు. ఇందులో సచిన్ టెండూల్కర్ పేరు అగ్రస్థానంలో ఉంది. 664 మ్యాచ్‌ల్లో 34357 పరుగులు చేశాడు. శ్రీలంక మాజీ బ్యాట్స్‌మెన్ కుమార సంగక్కర రెండో స్థానంలో ఉన్నాడు. 594 మ్యాచ్‌ల్లో 28016 పరుగులు చేశాడు. శ్రీలంక దిగ్గజం రికీ పాంటింగ్ 560 మ్యాచ్‌ల్లో 27483 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

వన్డేల్లో 14 వేల పరుగుల ఫిగర్‌ను దాటగలడు

దీంతో కోహ్లి లక్ష్యంలో మరో భారీ రికార్డు నమోదవుతుంది. వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 14000 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచేందుకు 128 పరుగులు చేయాల్సి ఉంది. 293 వన్డేల్లో 13872 పరుగులు చేశాడు. గత ఏడాది అత్యంత వేగంగా 26000 పరుగులు చేసిన క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. 511వ మ్యాచ్‌లో 567వ ఇన్నింగ్స్‌లో విరాట్ ఈ ఘనత సాధించాడు. కాగా టెండూల్కర్ 601 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు.