Site icon HashtagU Telugu

Yuvraj Singh: విరాట్ సపోర్ట్ ఎప్పటికీ మరువలేను: యువీ

Yuvraj Singh

New Web Story Copy 2023 06 24t202323.059

Yuvraj Singh: టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ తన క్రికెట్ జీవితానికి వీడ్కోలు పలికి పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు కామెంట్రీలో కనిపిస్తూ అభిమానుల్ని అలరిస్తున్నాడు. అయితే యువీ తాజాగా కోహ్లీ గురించి ఓ సీక్రెట్ పంచుకున్నాడు. క్యాన్సర్‌తో పోరాడిన యువరాజ్ టీమ్ ఇండియాలోకి తిరిగి వచ్చాడు. క్యాన్సర్‌తో పోరాడుతున్న సమయంలో యువరాజ్ సింగ్ 2011 ప్రపంచకప్‌లో కీ రోల్ ప్లే చేశాడు. అయితే విరాట్ కోహ్లీ భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు తనకు చాలా సపోర్ట్ చేశాడని వెల్లడించాడు. కోహ్లి లేకపోతే ఆ సమయంలో నేను మళ్ళీ జట్టులోకి వచ్చేవాడిని కాదని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.

2011 ప్రపంచకప్ సమయంలో యువరాజ్ సింగ్ క్యాన్సర్‌తో బాధపడుతూనే ప్రపంచ కప్ ఆడాడు. ఓ వైపు రక్తపు వాంతులు చేసుకున్నప్పటికీ తన పోరాటాన్ని ఆపలేదు. ఆరోగ్యం క్షణీస్తున్నా ప్రపంచ కప్ కీలక మ్యాచ్ లు ఆడి భారత్ ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. క్యాన్సర్‌కు చికిత్స పొందిన తర్వాత మరోసారి భారత జట్టులోకి వచ్చాడు. యువరాజ్ 2015 ప్రపంచకప్ మరియు 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు.

యువరాజ్ భారత్ తరఫున 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20లు ఆడాడు. వన్డేల్లో యువరాజ్ 36.55 సగటుతో 8701 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి. 2019లో యువరాజ్ సింగ్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Read More: Tiger janaki : వైజాగ్ జూపార్క్‌లో “టైగ‌ర్ జాన‌కి” మృతి