world cup 2023: టీమిండియా పాంచ్ పటాకా… కివీస్ పై భారత్ విజయం

ప్రపంచ కప్ లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. సెమీస్ రేసులో దూసుకెళ్తున్న న్యూజిలాండ్ ను ఓడించి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కు దూసుకెళ్లింది. రోహిత్ సేనకు వరుసగా ఇది అయిదో విజయం. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది.

world cup 2023: ప్రపంచ కప్ లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. సెమీస్ రేసులో దూసుకెళ్తున్న న్యూజిలాండ్ ను ఓడించి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కు దూసుకెళ్లింది. రోహిత్ సేనకు వరుసగా ఇది అయిదో విజయం. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. డారిల్ మిచెల్ సెంచరీతో చెలరేగగా.. రచిన్ రవీంద్ర 75 హాఫ్ సెంచరీతో రాణించాడు. నిజానికి భారత్ పేలవ ఫీల్డింగ్ కివీస్ కు కలిసొచ్చింది. 19 పరుగులకే న్యూజిలాండ్ 2 వికెట్లు కోల్పోయిన కివీస్ ను డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర ఆదుకున్నారు.రచిన్ రవీంద్ర 56 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా.. డారిల్ మిచెల్ 60 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. జడేజా బౌలింగ్‌లో మిచెల్ ఇచ్చిన క్యాచ్‌ను కేఎల్ రాహుల్ అందుకోలేకపోయాడు. ఈ అవకాశంతో రెచ్చి పోయిన డారిల్ మిచెల్… కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో మరో అవకాశం ఇచ్చాడు. కానీ బౌండరీ లైన్ వద్ద జస్‌ప్రీత్ బుమ్రా నేలపాలు చేశాడు. భారీ భాగస్వామ్యంతో దూసుకుపోతున్న ఈ జోడీని షమీ విడదీసాడు.

రచిన్ రవింద్ర 87 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 75 రన్స్ చేశాడు. తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో కివీస్ పరుగుల వేగం తగ్గింది. ఫిలిప్స్ సాయంతో ఆచితూచి ఆడిన మిచెల్ 100 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో షమీ వరుస ఓవర్లలో వికెట్లు పడగొట్టి కివీస్ జోరుకు బ్రేక్ వేశాడు. మిచెల్ 127 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 130 రన్స్ కు ఔట్ అయ్యాడు. షమీ 5 వికెట్లు పడగొట్టాడు.

274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు 11.1 ఓవర్లో 71 పరుగులు జోడించారు. అయితే ఫెర్గూసన్‌ వరుస ఓవర్లలో వీరిద్దరినీ ఔట్ చేశాడు. తర్వాత కోహ్లీ , శ్రేయాస్ అయ్యర్ ఇన్నింగ్స్ కొనసాగించారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 52 రన్స్ పార్టనర్ షిప్ నెలకొల్పారు. శ్రేయాస్ అయ్యర్ ఔట్ అయ్యాక పొగ మంచుతో కాసేపు మ్యాచ్ నిలిచిపోయింది. తిరిగి ఆట ప్రారంభమయ్యాక కోహ్లీ , కే ఎల్ రాహుల్ నిలకడగా ఆడి స్కోర్ పెంచారు. విజయం కోసం మరో 92 రన్స్ చేయాల్సి ఉండగా రాహుల్ వెనుదిరిగాడు. కాసేపటికే సూర్య కుమార్ యాదవ్ రనౌట్ అవడం టెన్షన్ మొదలైంది. ఈ దశలో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జడేజాతో కలిసి నిలకడగా ఆడుతూ విజయానికి చేరువ చేశాడు. సెంచరీ చేస్తాడనుకున్న కోహ్లీ 95 రన్స్ కు ఔట్ అయ్యాడు. తర్వాత జడేజా , షమీతో కలిసి జట్టు విజయాన్ని పూర్తి చేశాడు. దీంతో భారత్ మరో 12 బంతులు మిగిలి ఉండగా టార్గెట్ ను అందుకుంది.

Also Read: Vangaveeti Radha : ఘ‌నంగా వంగ‌వీటి రాధాకృష్ణ వివాహం.. హాజ‌రైన ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు