Virat Kohli: స్టార్ బ్యాటర్ డీన్ ఎల్గర్ పై ఉమ్మి వేసిన కోహ్లీ

ప్రపంచ క్రికెట్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్గా కొనసాగుతున్నాడు. సిచ్యువేషన్ తో సంబంధం లేకుండా కన్​సిస్టెంట్​గా పెర్ఫార్మ్ చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కింగ్ తన కన్​సిస్టెంట్​ బ్యాటింగ్ తో టీమిండియాకు అసాధారణ విజయాలను అందించాడు

Virat Kohli: ప్రపంచ క్రికెట్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్గా కొనసాగుతున్నాడు. సిచ్యువేషన్ తో సంబంధం లేకుండా కన్​సిస్టెంట్​గా పెర్ఫార్మ్ చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కింగ్ తన కన్​సిస్టెంట్​ బ్యాటింగ్ తో టీమిండియాకు అసాధారణ విజయాలను అందించాడు.

బ్యాటింగ్ పరంగా ఎంత కన్​సిస్టెంట్​ గా వ్యవహరిస్తాడో మైదానంలో ఫీల్డింగ్ సమయంలో అంతే దూకుడుగా ఉంటాడు. ప్రత్యర్థుల మానసిక స్తైర్యాన్ని దెబ్బకొట్టేలా ప్రవర్తిస్తాడు. స్లెడ్జింగ్ కాకపోయినా తన జోలికి వస్తే ఎవరినైనా ఎదిరిస్తాడు. ఖర్మకాలి కోహ్లీ క్రీజులో ఉన్నప్పుడు గెలికితే బ్యాట్ తో సమాధామిస్తాడు. ఆ సమాధానం ఎలా ఉంటుందంటే బౌలర్ తన ఓవర్ త్వరగా కంప్లీట్ చేసుకుని వెళ్లిపోవాలని అనుకుంటాడు. ఇక కింగ్ ఫిట్​నెస్​ లెవల్స్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇప్పటివరకు ఒక్కసారి కూడా NCA కు వెళ్ళలేదంటే కోహ్లీ బాడీ ఫిట్నెస్ ఏపాటిదో అర్ధమవుతుంది. అయితే కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో ఆఫ్ ఫీల్డ్ లో అంతే జోయల్ గా ఉంటాడు.

తాజాగా కోహ్లీ చేసిన పనిని సౌతాఫ్రికా ఆటగాడు గుర్తు చేసుకున్నాడు. సౌతాఫ్రికా జట్టు 2015లో టెస్ట్ సిరీస్​ కోసం భారత్​కు వచ్చింది. మొహాలీలో జరిగిన తొలి టెస్టులో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా బౌలింగ్​తో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా పరుగులు చేయడం కష్టంగా మారింది. ప్రోటీన్ జట్టు మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అశ్విన్, జడేజాలు స్లెడ్జింగ్ కి పాల్పడ్డారు. అప్పుడు కోహ్లీ నా దగ్గరకు వచ్చి నా మీద ఉమ్మేశాడంటూ డీన్ ఎల్గర్ సంచలన విషయాలు వెల్లడించాడు. డీన్ ఎల్గర్ కోహ్లీని ప్రత్యక్షంగా చూడడం అదే మొదటిసారి కావడంతో ఎల్గర్ కూడా తన భాషలో బూతులు తిట్టినట్లు చెప్పాడు. అయితే ఈ విషయాన్నీ ఏబీ డివిలియర్స్ తో పంచుకోగా ఎబిడి వెళ్లి కోహ్లీని అడిగాడని డీన్ చెప్పాడు. అప్పటికె వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉండటంతో కోహ్లీ తనకు సారీ చెప్పాడని ఎల్గర్ పేర్కొన్నాడు.

Also Read: Kerala Court : బిజెపి నేత హత్య కేసు..సెషన్స్‌ కోర్టు సంచలన తీర్పు