Virat Kohli: విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్‌లో 54వ సెంచరీని పూర్తి చేశారు. ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఆయన ఈ ఘనత సాధించారు. కేవలం 91 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కోహ్లీ తన సెంచరీని అందుకున్నారు. ఈ ఇన్నింగ్స్‌తో వన్డే క్రికెట్ చరిత్రలో న్యూజిలాండ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా విరాట్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో ఆయన రికీ పాంటింగ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు.
విరాట్ కొత్త వరల్డ్ రికార్డ్
వన్డే క్రికెట్ చరిత్రలో న్యూజిలాండ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచారు. కివీస్ జట్టుపై విరాట్‌కు ఇది 7వ సెంచరీ. ఇప్పటివరకు రికీ పాంటింగ్, వీరేందర్ సెహ్వాగ్ న్యూజిలాండ్‌పై చెరో 6 సెంచరీలు చేసి అగ్రస్థానంలో ఉండగా ఇప్పుడు విరాట్ వారిని అధిగమించి అగ్రపీఠాన్ని కైవసం చేసుకున్నారు.
Also Read: మహేష్ వారణాసి మూవీ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
న్యూజిలాండ్‌పై అత్యధిక వన్డే సెంచరీలు
- విరాట్ కోహ్లీ – 7 సెంచరీలు
- రికీ పాంటింగ్ – 6 సెంచరీలు
- వీరేందర్ సెహ్వాగ్ – 6 సెంచరీలు
- సచిన్ టెండూల్కర్ – 5 సెంచరీలు
- సనత్ జయసూర్య – 5 సెంచరీలు
ఐదు దేశాలపై 7 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు
విరాట్ కోహ్లీ ఇప్పటివరకు వన్డేల్లో ఐదు వేర్వేరు దేశాలపై 7 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు బాదిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇప్పుడు న్యూజిలాండ్‌లపై కూడా ఆయన 7 సెంచరీల మార్కును అందుకున్నారు. వీటిలో శ్రీలంకపై మాత్రమే విరాట్ కోహ్లీ 10 సెంచరీల మైలురాయిని చేరుకోవడం విశేషం.
- 10 సెంచరీలు – శ్రీలంకపై
- 9 సెంచరీలు – వెస్టిండీస్‌పై
- 8 సెంచరీలు – ఆస్ట్రేలియాపై
- 7 సెంచరీలు – దక్షిణాఫ్రికాపై
- 7 సెంచరీలు – న్యూజిలాండ్‌పై
విరాట్ కోహ్లీ అంతర్జాతీయ కెరీర్‌లో ఇది 85వ సెంచరీ. అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో అగ్రస్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్ (100 సెంచరీలు) రికార్డుకు ఆయన మరో 15 సెంచరీల దూరంలో ఉన్నారు. భారత గడ్డపై విరాట్‌కు ఇది 41వ సెంచరీ కావడం గమనార్హం. కాగా విరాట్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో 28 వేల పరుగుల మైలురాయిని అధిగమించారు.
