Virat Kohli: ఆర్సీబీ కప్ కొట్టాలంటే కోహ్లీ ఆర్డర్ మారాల్సిందే: పఠాన్

ఐపీఎల్ మొదలై 15 సీజన్లు గడిచి ప్రస్తుతం 16 సీజన్ నడుస్తుంది. కానీ ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా కప్ ముద్దాడలేదు కోహ్లీ సేన. అయితేనేం ఆర్సీబీ అంటే ఒక బ్రాండ్ గా ముద్ర పడింది.

  • Written By:
  • Updated On - April 11, 2023 / 08:13 AM IST

Virat Kohli: ఐపీఎల్ మొదలై 15 సీజన్లు గడిచి ప్రస్తుతం 16 సీజన్ నడుస్తుంది. కానీ ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా కప్ ముద్దాడలేదు కోహ్లీ సేన. అయితేనేం ఆర్సీబీ అంటే ఒక బ్రాండ్ గా ముద్ర పడింది. ఇంతవరకూ కప్ కొట్టని జాబితాలో ఉన్న ఆర్సీబీ.. ఫ్యాన్స్ ను అలరించడంలో మాత్రం మిగతా జట్లతో పోలిస్తే కాస్త ముందే ఉంటుంది. అయితే ఆర్సీబీ ఆటతీరు బాగున్నప్పటికీ ఎందుకు చివరి వరకు ఆడలేకపోతున్నది అన్నది ప్రశ్న. ఇదే విషయంపై స్పందించాడు టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్. ఆర్సీబీ ఇప్పటివరకు కప్ కొట్టకపోవడానికి కారణాలను ఎత్తి చూపించాడు పఠాన్.

టీమిండియా మాజీ సారథి రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత సీజన్ల మాట అటుంచితే ఐపీఎల్ సీజన్ 16లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన మ్యాచుల్లో కోహ్లీ మార్క్ చూపించాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. అయితే ఆర్సీబీకి ఒక సమస్య ఉంది. టాప్ ఆర్డర్ బలంగా ఉన్నప్పటికీ మిడిల్ ఆర్డర్ మాత్రం పేలవంగా కనిపిస్తున్నది.

ఇది మొదటి సీజన్ నుంచి ఉన్న సమస్యే. అయితే అదే కప్ గెల్వకపోవడానికి కారణంగా చూపిస్తున్నారు పఠాన్. పఠాన్ తాజాగా ఆర్సీబీ కప్ గెలువకపోవడానికి కారణాలు ఏంటో తెలిపాడు. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ మిడిల్ ఆర్డ‌ర్‌లో ఆడాల‌ని, ఓపెన‌ర్‌గా రాకూడ‌ద‌ని అంటున్నాడు ఆర్‌సీబీ మిడిల్ ఆర్డ‌ర్ చాలా బ‌ల‌హీనంగా ఉంటుంది. అందుకే కోహ్లీ మిడిల్ ఆర్డర్ లో బ‌రిలోకి దిగితే స‌మ‌తూకం వ‌స్తుంద‌ని పఠాన్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీతో పాటు మిగతా ఆటగాళ్లు తమ బాధ్యతను తీసుకోవాలని సూచించాడు. ఇలా మార్పులు జరిగితే తప్ప ఐపీఎల్ లోకి ఆర్సీబీ కప్ గెలుచుకోదు అంటూ కామెంట్స్ చేశారు పఠాన్.

నిజానికి ఆర్సీబీ టాప్ ఆర్డర్ చాలా బలంగా ఉంటుంది. ఈ సీజన్లో కెప్టెన్ డుప్లెసిస్‌, కోహ్లీ, మ్యాక్స్ వెల్ దుమ్ముదులుతున్నారు. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. ఒకరిని మించి ఒకరు బలమైన ప్రదర్శన ఇస్తున్నారు. కానీ టాప్ ఆర్డర్ డౌన్ అయితే ఆర్సీబీ కష్టాల్లోకి వెళుతుంది. సో.. కోహ్లీ మిడిల్ ఆర్డర్ లోనే రావాలని పలువురు క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.