Site icon HashtagU Telugu

Virat Kohli-Shakib Al Hasan: లైవ్ మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్‌ను ఆట ప‌ట్టించిన విరాట్ కోహ్లీ.. వీడియో వైర‌ల్‌

Virat Kohli

Virat Kohli

Virat Kohli-Shakib Al Hasan: చెన్నై వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అభిమానులు ఆశించినంత రాణించ‌లేక‌పోయాడు. మెహదీ హసన్ మిరాజ్ అతడిని ట్రాప్ చేసి పెవిలియన్‌కు చేర్చాడు. అయితే ఔట్ కాక‌ముందు విరాట్ కోహ్లీ షకీబ్ అల్ హసన్‌ (Virat Kohli-Shakib Al Hasan)ల వీడియో ఒక‌టి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో విరాట్ కోహ్లీ నాన్‌స్ట్రైక్‌పై నిలబడి షకీబ్‌ను ఆట ప‌ట్టిస్తున్నాడు. విరాట్, షకీబ్ మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

విరాట్ కోహ్లీ ఫన్నీ మాట‌లు

రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ మంచి ఫామ్‌లో కనిపించాడు. కొన్ని దూకుడు షాట్లు కూడా ఆడాడు. అయితే షకీబ్ అల్ హసన్ విరాట్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు.. యార్కర్ తర్వాత యార్కర్ బౌలింగ్ చేస్తూ నువ్వు మలింగగా మారుతున్నావు అని విరాట్ సరదాగా చెప్పాడు. ఈ సంఘటన స్టంప్ మైక్‌లో రికార్డైంది. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో విరాట్ 37 బంతుల్లో 17 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ సమయంలో కోహ్లీ బ్యాట్‌ నుంచి 2 ఫోర్లు వచ్చాయి.

Also Read: Bike Maintenance : బైక్ తెల్లటి పొగను ఎందుకు వెదజల్లుతుంది? మీకూ ఇలా జరిగితే వెంటనే మెకానిక్ వద్దకు వెళ్లండి.!

అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వికెట్ కూడా చర్చనీయాంశమైంది. మెహిదీ హసన్ మిరాజ్ వేసిన బంతిని ఫ్లిక్ చేసేందుకు ప్రయత్నించినందుకు విరాట్‌ను అంపైర్ అవుట్‌గా ప్రకటించారు. అయితే బంతి విరాట్ బ్యాట్ అంచుకు త‌గిలి ప్యాడ్‌కు తగిలింది. కానీ విరాట్‌కి మాత్రం అలా అనిపించలేదు. దీని తర్వాత విరాట్ DRS గురించి శుభమన్ గిల్‌తో మాట్లాడాడు. అయితే గిల్ మాట‌ల‌కు కోహ్లీ డీఆర్‌ఎస్ తీసుకోకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఒకవేళ విరాట్ డీఆర్‌ఎస్ డిమాండ్ చేసి ఉంటే నాటౌట్‌గా నిలిచేవాడు. ఈ సంఘటన తర్వాత రోహిత్ శర్మ కూడా డగౌట్ నుండి అస‌హ‌నంగా క‌నిపించాడు.

రెండో రోజు 17 వికెట్లు పడిపోయాయి

మ్యాచ్ రెండో రోజు భారత బౌలర్లు తమ సత్తా చాటారు. జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్‌దీప్ అద్భుతంగా బౌలింగ్ చేసి బంగ్లాదేశ్‌ను కేవలం 47.1 ఓవర్‌లో 149 పరుగులకు ఆలౌట్ చేశారు. బంగ్లా తరఫున షకీబ్ అత్యధికంగా 32 పరుగులు చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 23 ఓవర్లలో 81/3 స్కోరు చేసి 308 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. శుభ్‌మన్ గిల్ 64 బంతుల్లో 33 పరుగులతో, రిషబ్ పంత్ 13 బంతుల్లో 12 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. మూడో రోజు భారత బ్యాట్స్‌మెన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.