Virat Kohli: మూడేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ టెస్టు సెంచరీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో 75వ సెంచరీ

విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 241 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. ఎప్పుడో 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై టెస్టుల్లో సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ.. ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు.

  • Written By:
  • Updated On - March 12, 2023 / 01:16 PM IST

విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 241 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. ఎప్పుడో 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై టెస్టుల్లో సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ.. ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేశాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది  28వ సెంచరీ.  అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీకి ఇది 75వ సెంచరీ.

విరాట్ తన ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 7 ఫోర్లు కొట్టాడు. భారత్ స్కోరు 400 పరుగులకు చేరువైంది. విరాట్ కోహ్లీ టెస్టుల్లో 28వ సెంచరీని నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతనికి ఇది 75వ సెంచరీ. ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీకి ఇది 16వ సెంచరీ. 20 సెంచరీలతో సచిన్ టెండూల్కర్ టాప్‌లో ఉండగా, కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ టెస్టులో 1205 రోజుల (39 నెలలు) తర్వాత కోహ్లీ తన 28వ టెస్టు సెంచరీని సాధించాడు.

Also Read: Shreyas Iyer: టీమిండియా బ్యాట్స్‌మెన్ కు గాయం.. వెన్నునొప్పితో బాధపడుతున్న అయ్యర్

దీనికి ముందు, 23 నవంబర్ 2019న కోహ్లీ బంగ్లాదేశ్‌పై చివరిసారిగా తన 27వ టెస్ట్ సెంచరీని సాధించాడు. ఆదివారం ఆస్ట్రేలియాపై కోహ్లీ 1205 రోజులు, 23 టెస్టులు, 41 ఇన్నింగ్స్‌ల తర్వాత తన 28వ టెస్టు సెంచరీని నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 2023లో కోహ్లీకి ఇది మూడో సెంచరీ.  అంతకు ముందు వన్డే ఫార్మాట్‌లో 2 సెంచరీలు సాధించాడు.