Site icon HashtagU Telugu

IPL Auction 2022 : ఎప్పటికీ ఆర్సీబీతోనే అంటున్న ‘విరాట్ కోహ్లీ’..!

Kohli Rcb

Kohli Rcb

ఆర్సీబీ పై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ. తన 8 ఏళ్ల నాయకత్వంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఒక్క ట్రోఫీని కూడా కోహ్లీ అందించని విషయం తెలిసిందే. అయినా కూడా ఆ జట్టు పట్ల తనకున్న విధేయతను మరోసారి చాటుకున్నాడు. తనను కూడా ఐపీఎల్ వేలంలో పాల్గొనాలని చాలా ఫ్రాంచైజీలు కోరాయని… కానీ తాను మాత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతోనే ఉంటానని విరాట్ కోహ్లీ మరోసారి స్పష్టం చేశాడు. 8 ఏళ్ళ పాటు ఆర్సీబీకి సారథ్యం వహించిన కోహ్లీ, ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా కోహ్లీ మాట్లాడుతూ.. ఐపీఎల్ మెగా వేలంలోకి రావాలని గతంలో కొన్ని ఫ్రాంచైజీలు తనను సంప్రదించాయని పేర్కొన్నాడు. అయితే, తాను మాత్రం ఎప్పటికీ ఆర్సీబీతోనే ఉండాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. మరోవైపు, ఆర్సీబీ జట్టుకు సుదీర్ఘకాలం సారథ్యం వహించినప్పటికీ ఒక్కసారి కూడా ట్రోఫీ అందుకోకపోవడంపై కోహ్లీ స్పందిస్తూ.. కప్పు ఎంత మాత్రమూ ప్రాతిపదిక కాదని అన్నాడు. ఎట్టకేలకు నువ్వు ఫలానా జట్టుతో ఐపీఎల్ ట్రోఫీ గెలిచావు అని జనంతో అనిపించుకోవడం కంటే… ఆర్సీబీకి విధేయుడిగా ఉండడాన్నే తాను ఎక్కువగా ఇష్టపడతానని పేర్కొన్నాడు. అదే తనకు లభించిన గొప్ప గౌరవంగా భవిస్తానని చెప్పుకొచ్చాడు . దీన్ని బట్టి మనం అర్దం చేసుకోవచ్చు కోహ్లీకి ఆర్సీబీ జట్టుపైనా… ఆ టీమ్ పై ఆదరణ, అభిమానం చూపిస్తున్న ఆడియెన్స్ పైనా ఎంత ప్రేమ ఉందనేది. సో.. కెప్టెన్ గా ఆ జట్టుకు కప్పు అందించడంలో విఫలమైన కోహ్లీ… ఇప్పుడు ఆర్సీబీలో ఒక ఆటగాడిగా ఆ కలను ఎలా నెరవేర్చుకుంటాడో అన్నది వేచి చూడాలి.