Virat Kohli-Rohit Sharma: ఇంగ్లాండ్‌లో జరిగే 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శనివారం, మే 24న భారత జట్టును ప్రకటించారు. ఈ జట్టు ప్రకటనకు ముందు ఈ నెల ప్రారంభంలో మే 7న భారత టెస్ట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్ టెస్టుల్లో ఓపెనింగ్ చేసేవాడు. రోహిత్ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయిన ఐదు రోజుల తర్వాత మే 12న విరాట్ కోహ్లీ (Virat Kohli-Rohit Sharma) కూడా టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత కెప్టెన్‌తో పాటు రోహిత్, విరాట్ స్థానంలో టెస్ట్ జట్టులో ఎవరు చోటు దక్కించుకుంటారనే ప్రశ్న కూడా తలెత్తింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) జట్టు ప్రకటన తర్వాత ఈ ప్రశ్నకు సమాధానం లభించింది.
రోహిత్ శర్మ స్థానంలో సాయి సుదర్శన్
BCCI ఇంగ్లాండ్ టూర్ కోసం సాయి సుదర్శన్‌ను ఎంపిక చేసింది. సాయి సుదర్శన్.. రోహిత్ శర్మ స్థానంలో ఓపెనింగ్ చేయవచ్చు. సాయి సుదర్శన్ IPL 2025లో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ప్రస్తుతం సుదర్శన్ ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు. సాయి సుదర్శన్ 13 మ్యాచ్‌లలో 628 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ టూర్‌లో సుదర్శన్ ఓపెనింగ్‌గా కనిపించవచ్చు.
Also Read: MS Dhoni: నేడు ధోనీ చివరి మ్యాచ్.. ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పబోతున్నాడా?
విరాట్ కోహ్లీ స్థానంలో కరుణ్ నాయర్
విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత అతని స్థానంలో కరుణ్ నాయర్‌ను తీసుకొచ్చారు. కరుణ్ నాయర్ జట్టులో ఏ నంబర్‌లో బ్యాటింగ్ చేస్తాడనే విషయంపై ఇంకా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. కానీ విరాట్ స్థానం ఖాళీ కావడంతో కరుణ్ నాయర్‌ను జట్టులోకి తీసుకొచ్చారు. కరుణ్ భారత జట్టు కోసం దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అయితే విరాట్ కోహ్లీ స్థానంలో మూడో నంబర్‌లో టెస్ట్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ చేయవచ్చు. కరుణ్ నాయర్ అంతర్జాతీయ క్రికెట్‌లో 300 పైగా పరుగులు నాటౌట్‌గా చేశాడు.