Virat Kohli- Rohit Sharma: అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్- కోహ్లీ జంట.. 2 పరుగులు చేస్తే చాలు..!

టీమిండియా ఇద్దరు కీలక ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Virat Kohli- Rohit Sharma)ల ఆటతీరుపైనే అందరి చూపు కచ్చితంగా ఉంటుంది. ఇప్పటివరకు ఈ ఇద్దరు ఆటగాళ్లు వన్డే ఫార్మాట్‌లో పాకిస్తాన్‌పై అద్భుతమైన ప్రదర్శనను చూశాం.

  • Written By:
  • Publish Date - September 1, 2023 / 02:53 PM IST

Virat Kohli- Rohit Sharma: 2023 ఆసియా కప్‌లో భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను రేపు పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇద్దరు కీలక ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Virat Kohli- Rohit Sharma)ల ఆటతీరుపైనే అందరి చూపు కచ్చితంగా ఉంటుంది. ఇప్పటివరకు ఈ ఇద్దరు ఆటగాళ్లు వన్డే ఫార్మాట్‌లో పాకిస్తాన్‌పై అద్భుతమైన ప్రదర్శనను చూశాం. అదే సమయంలో రోహిత్- విరాట్ జంట వారి పేరు మీద పెద్ద రికార్డు చేయడానికి కేవలం 2 అడుగుల దూరంలో ఉన్నారు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కలిసి ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో భారత జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. 85 వన్డేల్లో కలిసి ఆడుతూ 62.47 సగటుతో ఇద్దరూ కలిసి 4998 పరుగులు చేశారు. రోహిత్, విరాట్ మధ్య 18 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీల భాగస్వామ్యాలు కనిపించాయి. ఇప్పుడు ఇద్దరూ 5000 పరుగుల ఫిగర్‌ను పూర్తి చేయడానికి కేవలం 2 పరుగుల దూరంలో ఉన్నారు.

వన్డే ఫార్మాట్‌లో ఇప్పటివరకు కేవలం 2 జోడీలు మాత్రమే 5000 పరుగులను అధిగమించగలిగారు. ఇందులో సచిన్ టెండూల్కర్- సౌరవ్ గంగూలీ అత్యధిక పరుగులు చేసిన జంటగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి మొత్తం 8227 పరుగులు చేశారు. అదే సమయంలో రెండవ నంబర్‌లో శిఖర్ ధావన్,- రోహిత్ శర్మల జోడి ఉంది. వీరు కలిసి 5193 పరుగులు చేశారు. పాకిస్థాన్‌పై రోహిత్‌- విరాట్‌లు ఈ ఫీట్‌ చేయడంలో సఫలమైతే.. వేగంగా ఈ స్థాయికి చేరుకున్న జోడీగా రికార్డులకెక్కుతారు.

Also Read: Asia Cup 2023 Points Table: విజయాలతో టాప్ లో ఉన్న శ్రీలంక, పాక్.. ఆసియా కప్ పాయింట్ల పట్టిక ఇదే..!

రోహిత్ శర్మ వన్డేల్లో పదివేల పరుగులకు చేరువలో ఉన్నాడు

భారత కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్‌లో 10,000 పరుగులు పూర్తి చేయడానికి కేవలం 163 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న రెండో ఆటగాడిగా రోహిత్ నిలవనున్నాడు. వన్డేల్లో 205 ఇన్నింగ్స్‌ల్లో వేగంగా 10,000 పరుగులు పూర్తి చేసిన రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉంది. రోహిత్ ఇప్పటివరకు 237 ఇన్నింగ్స్‌ల్లో 9837 పరుగులు చేశాడు.