Virat Kohli- Rohit Sharma: టీ20ల్లోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ.. యువ ఆటగాళ్లకు నష్టమేనా..?

టీమిండియాలోని ఇద్దరు పెద్ద స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (Virat Kohli- Rohit Sharma) మళ్లీ జట్టులోకి వచ్చారు. వీరిద్దరూ పునరాగమనం చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. కొందరు యువ ఆటగాళ్ల స్థానానికి కూడా ముప్పు పొంచి ఉంది.

  • Written By:
  • Publish Date - January 10, 2024 / 11:00 AM IST

Virat Kohli- Rohit Sharma: T20 ప్రపంచ కప్ 2024 జూన్ 1 నుండి ప్రారంభం కానుంది. T20 ప్రపంచ కప్ కు వెస్టిండీస్, USA ఆతిథ్యమిస్తున్నాయి. ఈ టోర్నీ కోసం టీమిండియా సన్నాహాలు ప్రారంభించింది. టీమిండియాలోని ఇద్దరు పెద్ద స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (Virat Kohli- Rohit Sharma) మళ్లీ జట్టులోకి వచ్చారు. వీరిద్దరూ పునరాగమనం చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. కొందరు యువ ఆటగాళ్ల స్థానానికి కూడా ముప్పు పొంచి ఉంది. జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌లో రోహిత్ శర్మ టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం రవీంద్ర జడేజాకు ఈ సిరీస్‌లో చోటు దక్కలేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ టీ20 ప్రపంచకప్‌లో ఆడడం ఖాయం అని భావించవచ్చు. అంటే గత కొన్ని నెలలుగా నిరంతరం జట్టులో కొనసాగుతున్న యువ ఆటగాళ్ల స్థానానికి ముప్పు పొంచి ఉంది.

హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ సిరీస్‌లో భాగం కాదు. ఈ ఇద్దరు ఆటగాళ్లు గాయపడ్డారు. వారు తిరిగి వచ్చి T20 ప్రపంచ కప్ వరకు ఆడటం ఖాయంగా భావించవచ్చు. అంటే ఇప్పటికే రోహిత్, విరాట్‌లు తిరిగొచ్చారు. సూర్య, హార్దిక్‌లు కూడా ప్రపంచకప్ వరకు తిరిగి రానున్నారు. రవీంద్ర జడేజా ఆడటం కూడా ఖాయంగానే భావించవచ్చు. రోహిత్ శర్మతో ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్ లేదా శుభ్‌మన్ గిల్‌ను సెట్ చేయవచ్చు. అంటే దీని ప్రకారం వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా ఫినిషర్ ఎవరనేది టీమ్ మేనేజ్ మెంట్ కు తలనొప్పిగా మారే అవకాశముంది. అదే సమయంలో నిరంతరం రాణిస్తున్న రింకూ సింగ్, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లపై వేటు కూడా పడొచ్చు.

Also Read: ICC Test Ranking: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన కోహ్లీ, రోహిత్..!

రింకూ సింగ్ అత్యుత్తమ రికార్డు

గత కొంత కాలంగా విరాట్, రోహిత్, జడేజా లాంటి ఆటగాళ్లు జట్టులో లేనప్పుడు రింకూ సింగ్ లాంటి ఆటగాళ్లు జట్టులో స్థానం ఖాయం చేసుకున్నారు. కానీ ఇప్పుడు అతని అద్భుతమైన ప్రదర్శన, రికార్డు ఉన్నప్పటికీ జట్టులో స్థానం కోల్పోవచ్చు. రింకూ సింగ్ గత కొద్ది రోజులుగా ఫినిషర్‌గా జట్టులో తనదైన ముద్ర వేశాడు. వన్డే క్రికెట్‌లోనూ అరంగేట్రం చేసి తానేంటో నిరూపించుకున్నాడు. రింకూ సింగ్ కేవలం 8 మ్యాచ్‌లలో 65 కంటే ఎక్కువ సగటుతో ఉన్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే జట్టు ఎంపికలో టీమ్ మేనేజ్‌మెంట్ కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అనుభవం వైపు నుంచి చూస్తారో లేక ప్రస్తుతం ఎవరు రాణిస్తున్నారో చూసి ఎంపిక చేస్తారో తెలియాల్సి ఉంది. రవీంద్ర జడేజా బౌలర్‌గా నిరూపించుకున్నా బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేకపోయాడు. అయితే అతను జట్టుకు ముఖ్యమైన ఆటగాడనడంలో సందేహం లేదు. కానీ టీ20లో శుభ్‌మన్ గిల్ తనని తాను నిరూపించుకోలేకపోయాడు. సూర్య, హార్దిక్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం జితేష్ శర్మ, సంజూ శాంసన్ వికెట్ కీపింగ్ జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే జూన్ వరకు పరిస్థితి ఎలా ఉంటుందో కాలమే చెప్పాలి.