Virat Kohli- Rohit Sharma: ఇంగ్లండ్‌తో ఆడనున్న 3-మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో (Virat Kohli- Rohit Sharma) సహా టీమిండియా ఆటగాళ్లు నాగ్‌పూర్ చేరుకున్నారు. ఫిబ్రవరి 6 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్‌కు చివరి సిరీస్ కావడంతో ఈ సిరీస్ ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పటికే టి20 సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ వన్డేలోనైనా రాణించి సిరీస్ కైవసం చేసుకోవాలని అనుకుంటుంది. అటు యువ జట్టు సిరీస్ గెలవడంతో వన్డే సిరీస్ ను రోహిత్ సేన ఎలాగైనా గెలవాలని భావిస్తుంది.
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా జరగనుంది. ఇందుకోసం పలువురు ఆటగాళ్లు అక్కడికి చేరుకున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మాన్ గిల్ మరియు రిషబ్ పంత్ కలిసి విమానాశ్రయం నుండి బయలుదేరుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రోహిత్, కోహ్లీ బ్లాక్ హుడీలో స్టైలిష్ లుక్స్ లో కనిపించారు. కాగా టి20 లో ఆడిన పలువురు ప్లేయర్లు వన్డేలోనూ స్థానం దక్కించుకున్నారు. అయితే ఈ ఆటగాళ్లు త్వరలో నాగ్ పూర్ చేరుకుని జట్టులో చేరనున్నారు. ఇందులో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌తో పాటు పలువురు ఆటగాళ్లు ఉన్నారు. రెండు జట్ల మధ్య జరిగిన టీ-20 సిరీస్‌లో భారత్ 4-1తో సిరీస్‌ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
Also Read: High Court : తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక.. హైకోర్టు కీలక ఆదేశాలు
2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌తో జరగనున్న ఈ వన్డే సిరీస్‌లో భారత ఆటగాళ్లు ఫామ్‌ను పొందాలనుకుంటున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా చాలా మంది స్టార్ ఆటగాళ్లు ఫామ్‌లో లేరన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇంగ్లండ్ నాణ్యమైన బౌలింగ్ ముందు భారత బ్యాట్స్‌మెన్లు రాణించాలంటే కచ్చితంగా తమ పాత ఫామ్ ని తిరిగి పొందాల్సిందే. ఈ సిరీస్ తర్వాత ఛాంపియన్ ట్రోఫీ ఉండటంతో ఆటగాళ్లకు ఈ సిరీస్ అత్యంత కీలకంగా మారింది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఇప్పటికే ప్రకటించారు. జట్టులో రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్), రిషబ్ పంత్ (వికెట్), హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా**, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా ఉన్నారు.