Site icon HashtagU Telugu

Kohli Retirement Post: విరాట్ కోహ్లీ టెస్టు రిటైర్మెంట్ పోస్ట్‌లో ఏం రాశాడో తెలుసా?

Kohli Retirement Post

Kohli Retirement Post

Kohli Retirement Post: గత దశాబ్దం నుంచి టెస్ట్ క్రికెట్‌పై ఆధిపత్యం చెలాయిస్తున్న విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ అత్యంత పురాతన ఫార్మాట్‌కు వీడ్కోలు (Kohli Retirement Post) పలికాడు. సోమవారం కింగ్ కోహ్లీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసి టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. విరాట్ తన రిటైర్మెంట్ పోస్ట్‌ను ఆంగ్లంలో రాశాడు. ఇక్కడ తెలుగులో విరాట్ ఏమి రాశాడో తెలుసుకుందాం.

విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం తీసుకోవడం సులభం కాదని అంగీకరించాడు. కింగ్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఇలా రాశాడు. నేను ఈ ఆట కోసం మైదానంలో నాతో ఆడిన వారి కోసం, ఈ ఆట సమయంలో నన్ను ఆడుతూ చూసిన ప్రతి ఒక్కరి కోసం హృదయంలో కృతజ్ఞతతో వెళ్తున్నాను. 14 సంవత్సరాల క్రితం టెస్ట్ క్రికెట్‌లో మొదటిసారి ‘బ్యాగీ బ్లూ’ ధరించాను. నిజం చెప్పాలంటే ఈ ఫార్మాట్ నన్ను ఇలాంటి ప్రయాణంలోకి తీసుకెళ్తుందని నేను ఊహించలేదు. ఇది నన్ను పరీక్షించింది. నన్ను రూపొందించింది. నా జీవితాంతం నాతో ఉండే పాఠాలను నేర్పించింది అని కోహ్లీ రాసుకొచ్చాడు.

Also Read: Anushka Sharma: విరాట్ కోహ్లీ టెస్టు రిటైర్మెంట్‌పై అనుష్క శ‌ర్మ ఎమోష‌న‌ల్‌!

క్రికెట్ ఈ ఫార్మాట్ కోసం తన వీడ్కోలు నోట్‌లో కోహ్లీ ఇలా రాశాడు. తెల్లని దుస్తుల్లో ఆడటం అంతరంగికంగా చాలా వ్యక్తిగతమైనది. నిశ్శబ్దంగా కష్టపడటం, దీర్ఘమైన రోజులు, ఎవరూ చూడని చిన్న క్షణాలు, కానీ ఈ క్షణాలు ఎప్పటికీ మీతో ఉంటాయి. నేను ఈ ఫార్మాట్ నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు ఇది సులభం కాదు. కానీ ఇది సరైనదనిపిస్తుంది. నేను దీనికి నా సర్వస్వం ఇచ్చాను. ఇది (టెస్టు క్రికెట్‌) నాకు నా అంచనాలకు మించి ఇచ్చింది. నేను ఎప్పటికీ నా టెస్ట్ కెరీర్‌ను చిరస్థాయిగా చూస్తూ ఆనంద‌ప‌డ‌తాను అని కోహ్లీ రాశాడు.

ఇక‌పోతే విరాట్ కోహ్లీ ఇప్పటికే T20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు అతను టెస్ట్ క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికాడు. విరాట్ ఇప్పుడు భారత్ తరపున కేవలం వన్డేలు మాత్రమే ఆడతాడు. 2027 వరల్డ్ కప్ వరకు విరాట్ వన్డే ఫార్మాట్‌ను కొనసాగిస్తాడని భావిస్తున్నారు. ఆ త‌ర్వాత వ‌న్డేల‌కు కూడా గుడ్ బై చెప్పే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే టెస్టుల‌కు రోహిత్ శ‌ర్మ‌, అశ్విన్ గుడ్ బై చెప్పిన సంగ‌తి తెలిసిందే. వీరి బాట‌లోనే జ‌డేజా, బుమ్రా కూడా న‌డిచే అవ‌కాశం ఉంది.