Kohli Funny Video: విరాట్ కోహ్లీ మైదానంలో ఉన్నంత కాలం వినోదానికి లోటు ఉండదు. తాను బ్యాటరే కాదు అంతకు మించి గొప్ప ఎంటర్ టైనర్ కూడా. బ్యాట్ పడితే ఎలాగైతే విధ్వంసం సృష్టిస్తాడో ఫీల్డింగ్ సమయంలో తన చిలిపి చేష్టలతో నవ్వులు పూయిస్తాడు.ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో కోహ్లీ డ్యాన్సర్ గా మారిపోతాడు. కాస్త సమయం దొరికితే బౌలర్ల యాక్షన్ ను ఇమిటేట్ చేస్తాడు.
గతంలో ఇలాంటి ఎన్నో వీడియోలు మనల్ని నవ్వించాయి. ఇప్పుడు కోహ్లీ (Virat Kohli) కి 35 ఏళ్ళు. అయినా తనలో ఆ చిలిపితనం పోలేదు. తాజాగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న కాన్పూర్ టెస్టులో కోహ్లీ నుంచి మరో ఆణిముత్యం బయటపడింది. కాన్పూర్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ బౌలింగ్ ప్రారంభించకముందే విరాట్ కోహ్లీ బౌలింగ్ తో నవ్వించాడు. ఈ వీడియోలో విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)ను అనుకరిస్తూ కనిపించాడు. బౌలింగ్ చేస్తున్నప్పుడు బుమ్రా ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ను కోహ్లీ ఎగ్జాట్ గా ఇమిటేట్ చేస్తూ కనిపించాడు. కోహ్లి యాక్షన్ చూసి అభిమానులు నవ్వు ఆపుకోలేకపోయారు. ఆ తర్వాత జడేజా కూడా అదే పని చేశాడు. విరాట్, జడేజాల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(IND vs BAN)
Virat Kohli and Jadeja mimics Bumrah's bowling action infront of him 😭🤣 pic.twitter.com/fRLvNOFAPG
— Vahini🕊️ (@fairytaledustt_) September 27, 2024
మైదానంలో ఉన్న యశస్వి జైస్వాల్ మరియు అసిస్టెంట్ కోచ్ టాన్ డెస్కోట్ కూడా వాల్లిద్దరి చేష్టలను చూసి నవ్వు ఆపుకోలేకపోయారు.కావాలంటే మీరు కూడా ఈ క్లిప్ చూసి ఎంజాయ్ చేయండి.కాగా ఈ టెస్టులో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. కాన్పూర్ టెస్టులో 35 పరుగులు చేస్తే.. విరాట్ అంతర్జాతీయంగా 27 వేల పరుగులు పూర్తి చేస్తాడు .ఇది జరిగితే 147 ఏళ్ల చరిత్రలో ఓ క్రికెటర్ 600 కంటే తక్కువ ఇన్నింగ్స్‌లో 27 వేల పరుగులు చేయడం ఇదే తొలిసారి అవుతుంది.
Also Read: IND vs BAN 2nd Test: 60 ఏళ్ళ తొలి కెప్టెన్ గా హిట్ మ్యాన్