Site icon HashtagU Telugu

Virat Kohli: రీఎంట్రీ మ్యాచ్ లో అరుదైన రికార్డుపై కన్నేసిన కింగ్ కోహ్లీ.. 35 పరుగులు చేస్తే చాలు..!

Virat Kohli

virat kohli

Virat Kohli: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య రెండో మ్యాచ్ ఈరోజు (జనవరి 14) ఇండోర్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ (Virat Kohli) టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి అడుగుపెట్టనున్నాడు. ఏడాదికి పైగా విరామం తర్వాత టీ20 ఇంటర్నేషనల్ ఆడనున్నాడు కోహ్లీ. చివరిసారిగా ఈ ఫార్మాట్‌లో 2022 టీ20 ప్రపంచకప్‌లో కనిపించాడు. చాలా కాలం తర్వాత టీ20కి పునరాగమనం చేయడంతో విరాట్ కోహ్లీ జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. దీంతో పాటు ఈ మ్యాచ్‌లో కోహ్లీ మరో రికార్డు సృష్టించడంపైనే అందరి చూపు ఉంది. విరాట్ కోహ్లీ T20 క్రికెట్‌లో 12000 పరుగులకు చాలా దగ్గరగా ఉన్నాడు. అతను ఈ సంఖ్య చేరుకోవాలంటే కేవలం 35 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇండోర్‌లో విరాట్ 35 పరుగుల ఇన్నింగ్స్ ఆడితే T20 క్రికెట్‌లో 12000 పరుగులు చేసిన నాల్గవ క్రికెటర్ అవుతాడు. భారత్ తరుపున మొదటి ఆటగాడు అవుతాడు.

విరాట్ కోహ్లీ ఇప్పటివరకు టీ20 క్రికెట్‌లో (అంతర్జాతీయ + డొమెస్టిక్ టీ20 + ఫ్రాంచైజీ లీగ్) 11,965 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన వ్యక్తిగా నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో అతని కంటే ముందున్న ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు 12 వేలకు పైగా పరుగులు చేశారు. ఇక్కడ టీ20 క్రికెట్‌లో 14,562 పరుగులు చేసిన క్రిస్ గేల్ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. రెండో స్థానం షోయబ్ మాలిక్‌ది. ఈ పాకిస్థానీ బ్యాట్స్‌మెన్ టీ20 క్రికెట్‌లో 12,993 పరుగులు చేశాడు. కీరన్ పొలార్డ్ మూడో స్థానంలో ఉన్నాడు. పొలార్డ్ ఇప్పటివరకు 12,430 పరుగులు చేశాడు.

Also Read: Dhruv Jurel Story: క్రికెట్ వద్దన్న తండ్రి.. గోల్డ్​ చైన్ అమ్మి క్రికెట్ కిట్ కొనిచ్చిన తల్లి.. ఇదే ధృవ్ జురెల్ రియల్ స్టోరీ..!

16 ఏళ్లుగా టీ20 క్రికెట్‌ ఆడుతున్నాడు

విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు మొత్తం 374 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక్కడ కోహ్లీ 41.40 సగటుతో 11,965 పరుగులు చేశాడు. ఈ కాలంలో అతని స్ట్రైక్ రేట్ 133.35. ఈ ఫార్మాట్‌లో విరాట్ పేరు మీద 8 సెంచరీలు, 91 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20 ఇంటర్నేషనల్‌, ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా కోహ్లీనే. అంతర్జాతీయ స్థాయిలో 4,008 పరుగులు చేసిన కింగ్ కోహ్లీ.. ఐపీఎల్‌లో 7,263 పరుగులు చేశాడు.

We’re now on WhatsApp. Click to Join.