Site icon HashtagU Telugu

Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

Virat Kohli Net Worth 2025

Virat Kohli Net Worth 2025

Virat Kohli Net Worth: భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ మొత్తం నికర ఆస్తుల విలువ (Virat Kohli Net Worth) రూ. 1,000 కోట్ల మార్కును దాటింది. దీంతో కింగ్ కోహ్లీ అత్యంత ధనిక భారతీయ ప్రముఖులలో ఒకరిగా నిలిచారు. స్టాక్ గ్రో నివేదిక ప్రకారం.. కోహ్లీ మొత్తం సంపద రూ 1,050 కోట్లు. ఇందులో భారత క్రికెట్ కాంట్రాక్టులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, బ్రాండ్ యాజమాన్యం, సోషల్ మీడియా పోస్టుల ద్వారా వచ్చే ఆదాయం కూడా కలిసి ఉంది.

కోహ్లీ ఆదాయ మార్గాలు

నివేదికల ప్రకారం.. కోహ్లీ ఆదాయంలో ఎక్కువ భాగం బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా వస్తుంది. కోహ్లీ టీమ్ ఇండియాతో తన కాంట్రాక్ట్ ద్వారా సంవత్సరానికి రూ. 7 కోట్లు సంపాదిస్తారని చెబుతారు. అలాగే ప్రతి టెస్ట్ మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, ప్రతి వన్డే మ్యాచ్‌కు రూ. 6 లక్షలు, ప్రతి టీ20 మ్యాచ్‌కు రూ. 3 లక్షలు తీసుకుంటారు. టీ20 లీగ్ (ఐపీఎల్) ద్వారా సంవత్సరానికి రూ. 15 కోట్లు ఆర్జిస్తారు.

Also Read: Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

అలాగే బ్లూ ట్రైబ్, యూనివర్సల్ స్పోర్ట్స్‌బిజ్, ఎంపీఎల్, స్పోర్ట్స్ కాన్వో, డిజిట్ వంటి అనేక స్టార్టప్‌లలో కోహ్లీ పెట్టుబడి పెట్టారు. కోహ్లీ 18 కంటే ఎక్కువ బ్రాండ్‌లకు ప్రచారం చేస్తున్నారు. వీటిలో వివో, మింత్రా, బ్లూ స్టార్, వోలిని, లక్సర్, హెచ్‌ఎస్‌బీసీ, ఊబర్, ఎంఆర్‌ఎఫ్, టిస్సోట్, సింథాల్ వంటివి ఉన్నాయి. ప్రతి అడ్వర్టైజ్‌మెంట్ షూట్ కోసం ఆయన రూ. 7.50 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు ఫీజు తీసుకుంటారని తెలుస్తోంది. ఆయన బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా సుమారు రూ. 175 కోట్లు సంపాదిస్తున్నారని సమాచారం.

సోషల్ మీడియా ఆదాయం

సోషల్ మీడియాలో కూడా కోహ్లీ తన ప్రతి పోస్ట్‌కు చార్జ్ చేస్తారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతి పోస్ట్‌కు రూ. 8.9 కోట్లు కాగా.. ట్విట్టర్‌లో ప్రతి పోస్ట్‌కు రూ. 2.5 కోట్లు తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం.

ఆస్తులు- వ్యాపారాలు

ఆయనకు వన్8 (One8) అనే రెస్టారెంట్ బ్రాండ్, రోగాన్ (Rogan) అనే అథ్లెజర్ (క్రీడా వస్త్రాలు), లగ్జరీ దుస్తుల బ్రాండ్లు ఉన్నాయి. కోహ్లీకి రెండు ఇళ్లు ఉన్నాయి. ముంబైలో రూ. 34 కోట్లు విలువ చేసే ఇల్లు, గురుగ్రామ్‌లో రూ. 80 కోట్లు విలువ చేసే ఇల్లు. ఆయన వద్ద రూ. 31 కోట్ల విలువైన లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. కోహ్లీ ఒక ఫుట్‌బాల్ క్లబ్, ఒక టెన్నిస్ జట్టు, ఒక ప్రో-రెజ్లింగ్ జట్టుకు కూడా యజమానిగా ఉన్నారు.

Exit mobile version