Virat Kohli:కోహ్లీ ఫాం చూసి ఓర్వలేక పోతున్న పాక్ మాజీలు

అవకాశం దొరికితే భారత క్రికెటర్లపై విమర్శలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచే పాకిస్థాన్ మాజీ ఆటగాళ్ళు మరోసారి కోహ్లిని టార్గెట్ చేశారు.

  • Written By:
  • Publish Date - September 15, 2022 / 01:29 PM IST

అవకాశం దొరికితే భారత క్రికెటర్లపై విమర్శలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచే పాకిస్థాన్ మాజీ ఆటగాళ్ళు మరోసారి కోహ్లిని టార్గెట్ చేశారు. ఇటీవలే ఆసియా కప్ తో పూర్తి ఫాంలోకి వచ్చిన కోహ్లీ పై మళ్లీ విమర్శలు గుప్పిస్తున్నారు. అతని మునుపటి ఫాం చూసి ఈర్ష్య పడుతున్నట్టు తెలుస్తోంది టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ షార్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతాడంటూ పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ వ్యాఖ్యానించాడు. మిగిలిన ఫార్మాట్ లపై మరింత దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. తానే గనుక కోహ్లీ అయి ఉంటే టీ20లకు రిటైర్ ఇచ్చేసి.. వన్డేలు, టెస్టుల మీద ఫోకస్ పెట్టి ఉండేవాడినని అక్తర్ ఓ టీవీ లైవ్ సెషన్‌లో చెప్పాడు. అటు మరో పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూడా కోహ్లీ రిటైర్ మెంట్ తీసుకోవటం మంచిదనీ ఇటీవల వ్యాఖ్యలు చేశాడు.

పాకిస్థాన్‌కు చెందిన సమా చానల్‌తో మాట్లాడిన అఫ్రిది.. ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే విరాట్ రిటైర్మెంట్ ప్రకటించడం ఉత్తమమని చెప్పాడు. జట్టు నుంచి తప్పించడం వంటి పరిస్థితికి వెళ్లకూడదన్నాడు. విరాట్ కోహ్లీ కెరీర్‌ను ఏ విధంగా ప్రారంభించాడో.. అలానే ముగింపు కూడా ఉన్నతస్థాయిలోనే ముగించాలని సూచించాడు. కాగా పాక్ మాజీ క్రికెటర్లు వ్యాఖ్యలపై భారత క్రికెట్ ఫాన్స్ మండిపడుతున్నారు. కోహ్లీ ఫాం చూసి ఓర్చుకోలేక పోతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. అఫ్రిది కామెంట్స్ కు భారత మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చాడు.డియర్‌ అఫ్రిది.. కొందరు ఒకసారి మాత్రమే ఆటకు వీడ్కోలు పలుకుతారు. కాబట్టి విరాట్ కోహ్లీని ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉంచండి అని మిశ్రా ట్వీట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. దిమ్మతిరిగిపోయే బదిలిచ్చాడంటూ అమిత్ మిశ్రాను భారత అభిమానులు కొనియాడుతున్నారు. ఇటీవల ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ పై కోహ్లీ మునుపటి టచ్ చూపిస్తూ.. తన 71వ అంతర్జాతీయ సెంచరీ చేశాడు. కోహ్లీ ఆసియాకప్ టోర్నీలో ఐదు మ్యాచ్‌లలో 276పరుగులతో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కూడా నిలిచాడు.