విరాట్ కోహ్లీ (Virat Kohli)…సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత బ్యాటర్ గా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అయితే ఏ ఆటగాడిని ఎలా ఉపయోగించుకోవాలో కోహ్లీకి బాగా తెలుసు. సారథిగా తన అనుభవాన్ని ఎప్పటికప్పుడు జట్టు కోసం వినియోగిస్తూ ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా సిరాజ్ (Siraj ) లాంటి బౌలర్ ను బాగా ఉపయోగించుకోవడంలో కోహ్లీని మించిన వారు లేరనే చెప్పాలి. ఒకవిధంగా సిరాజ్ ను మెరిక లాంటి పేసర్ తీర్చిదిద్దిన ఘనత విరాట్ దే. తాజాగా సఫారీ టూర్ (South Africa tour) లో ఇది మరోసారి రుజువైంది.
We’re now on WhatsApp. Click to Join.
సఫారీ బ్యాటర్ మార్కో జాన్సెన్ వికెట్ కోసం విరాట్ కోహ్లీ రచించిన ప్లాన్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. స్లిప్‌లో ఫీల్డింగ్ చేసిన విరాట్ కోహ్లీ.. బంతి వేసే ముందు సిరాజ్‌కు సైగలతో సలహా ఇచ్చాడు. ఇన్‌స్వింగర్ వేయాలని.. బ్యాటర్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేస్తాడని, అప్పుడు క్యాచ్ వస్తుందని సైగలతో సూచించాడు. కోహ్లీ చెప్పినట్లుగానే సిరాజ్ స్వింగర్ వేయగా.. మార్కో జాన్సెన్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేసి ఔటయ్యాడు.
జాన్సెన్ నిరాశగా పెవిలియన్ చేరగా.. సిరాజ్, కోహ్లీ సంబరాలు చేసుకున్నారు. ఈ వికెట్‌తోనే సిరాజ్ ఐదు వికెట్ల ఫీట్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ షాడో కెప్టెన్ అవతారమెత్తాడు. రోహిత్ శర్మనే కెప్టెన్ అయినా.. మైదానంలో కోహ్లీనే జట్టును నడిపించాడు. బౌలింగ్ మార్పులు.. ఫీల్డ్ సెటప్‌తో పాటు సౌతాఫ్రికా బ్యాటర్లు ఔటయ్యేలా ప్లాన్ రచించడంలోనూ కోహ్లీనే కీలక పాత్ర పోషించాడు.
Read Also : Mohammed Siraj Unleashed : బంతులా…బుల్లెట్లా…కేప్ టౌన్ రాజ్ సిరాజ్