Site icon HashtagU Telugu

Virat Kohli : కోహ్లీకి గాయం…తొలి వన్డే కి దూరం ?

Virat Kohli

Virat Kohli

ఇంగ్లాండ్ తో వన్డే సీరీస్ కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. టీమిండియాకు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తొలి వన్డేకు దూరమైనట్టు తెలుస్తోంది. గజ్జల్లో గాయం కారణంగా కోహ్లీ.. కిన్నింగ్టన్‌ ఓవల్‌లో జరిగే మ్యాచ్‌లో ఆడటంలేదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. గత కొన్ని రోజులుగా వరుసగా విఫలమవుతున్న విరాట్.. ఇటీవల జరిగిన రీషెడ్యూల్ ఐదో టెస్టు, టీ20 సిరీస్‌లోనూ ఫామ్ అందుకోలేక పోయాడు. ఇప్పుడు గాయం మరో సమస్యగా మారింది. సోమవారం ప్రాక్టీస్‌లోనూ కోహ్లీ పాల్గొనలేదు. గాయం కారణంగా మొదటి వన్డేకు విశ్రాంతినివ్వనుండగా రెండు, మూడు వన్డేల సమయానికి కోలుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. టీ ట్వంటీ సీరీస్ ముగిసిన అనంతరం టీమ్ తో పాటు కోహ్లీ వెళ్ళలేదు. మెడికల్ చెకప్ కోసం ఆగినట్లు అతడు ఆగినట్లు సమాచారం. గత మ్యాచ్ లో విరాట్ తొడ ప్రాంతంలో కండరాలు పట్టడం వల్ల ఇబ్బంది పడ్డాడు. అందుకే మెడికల్ చెకప్ తర్వాత విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సోమవారం నాడు జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌కు కొంతమంది మాత్రమే హాజరయ్యారు. శిఖర్ ధావన్, శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ లండన్‌లోని ఓవల్ మైదానంలో ప్రాక్టీస్ చేశారు. కోహ్లీ గాయం ఈ కారణంగా వెస్టిండీస్‌తో ఆగస్టులో జరగనున్న టీ20 సిరీస్‌కు భారత జట్టును ఎంపిక ఆలస్యమవుతుంది.

Exit mobile version