Site icon HashtagU Telugu

Kohli Dance: విశాఖ‌ప‌ట్నం వ‌న్డేలో డ్యాన్స్ అద‌ర‌గొట్టిన కోహ్లీ.. వీడియో వైర‌ల్‌!

Kohli Dance

Kohli Dance

Kohli Dance: విరాట్ కోహ్లీ శైలి చాలా ప్రత్యేకమైనది. అతను మైదానంలో ఉన్నాడంటే సరదాగా ఉంటుంది. అప్పుడప్పుడు డ్యాన్స్ (Kohli Dance) మూమెంట్స్ చేస్తూ, మరికొన్నిసార్లు ఇతరుల చర్యలను అనుకరిస్తూ ఉంటాడు. భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మూడో వన్డే మ్యాచ్‌లో కూడా అలాంటి సన్నివేశమే జరిగింది. భారత బౌలర్లు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను 270 పరుగులకే పరిమితం చేశారు. ఈ మ్యాచ్‌లో క్వింటన్ డి కాక్ 106 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

అయితే కుల్దీప్ యాదవ్.. కార్బిన్ బాష్‌ను అవుట్ చేసి దక్షిణాఫ్రికాకు ఎనిమిదో షాక్ ఇచ్చినప్పుడు విరాట్- కుల్దీప్ కలిసి కపుల్ డాన్స్ చేశారు. స్నేహపూర్వక శైలిలో కుల్దీప్ యాదవ్, విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. బాష్ వికెట్ తీసిన తర్వాత కుల్దీప్, విరాట్ చేతిని పట్టుకుని ఇద్దరూ కలిసి కపుల్ డాన్స్ చేసి అభిమానుల మనసు దోచుకున్నారు. భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మూడో ODI మ్యాచ్ హాస్యాస్పద క్షణాలతో నిండిపోయింది. వరుసగా 20 మ్యాచ్‌ల తర్వాత భారత జట్టు తొలిసారిగా టాస్ గెలవడంతో టాస్ గెలిచిన తర్వాత కేఎల్ రాహుల్ కూడా ఉత్సాహంగా కనిపించాడు.

భారత జట్టు తరఫున కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో నాలుగు వికెట్లు తీశారు. ఫలితంగా దక్షిణాఫ్రికా జట్టు మొత్తం 50 ఓవర్లు కూడా ఆడకుండానే 270 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ వన్డే సిరీస్‌లో రెండు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. మూడో మ్యాచ్ గెలిచిన జట్టు సిరీస్ విజేతగా నిలుస్తుంది. ఈ వార్త రాసే స‌మయానికి భార‌త్ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోకుండా 102 ప‌రుగులు చేసింది. రోహిత్ శ‌ర్మ (51), జైశ్వాల్ (40) క్రీజులో ఉన్నారు.

Also Read: Jasprit Bumrah: టీమిండియా ఫాస్ట్ బౌల‌ర్‌ బుమ్రా జీవితంలో విషాదం గురించి తెలుసా?

క్వింటన్ డి కాక్ రికార్డులు

దక్షిణాఫ్రికా జట్టు తరఫున క్వింటన్ డి కాక్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను మూడో ODI మ్యాచ్‌లో 106 పరుగుల సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇది అతని వన్డే కెరీర్‌లో 23వ సెంచరీ. దీంతో వన్డేలలో వికెట్ కీపర్‌గా అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో కుమార సంగక్కరతో సమానంగా నిలిచాడు. భారత్‌పై వన్డేల్లో అతనికి ఇది 7వ సెంచరీ. దీంతో భారత్‌పై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాళ్లలో సనత్ జయసూర్యతో సమంగా నిలిచాడు.

Exit mobile version