Site icon HashtagU Telugu

Virat Kohli: ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగాళ్లలో మూడవ స్థానంలో కోహ్లీ.. మొదటి రెండు స్థానాల్లో ఉన్నది వీళ్ళే..!

Happy Birthday Virat Kohli

Virat Kohli Imresizer

Virat Kohli: విరాట్ కోహ్లీ (Virat Kohli) తన అద్భుతమైన ఆటతీరుతో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లి ఎన్నో రికార్డులు సృష్టించాడు. అందుకే కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. క్రికెట్‌తో పాటు విరాట్ జీవనశైలిని కూడా అభిమానులు ఇష్టపడతారు. ఒక నివేదిక ప్రకారం.. 2023లో ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడాకారులలో కోహ్లీ మూడవ స్థానంలో ఉన్నాడు.

కోహ్లీని ప్రపంచంలో ప్రేమించే వారి సంఖ్య కోట్లలో ఉంది. హాప్పర్ హెచ్‌క్యూ నివేదిక ప్రకారం.. 2023లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడాకారుల జాబితాలో కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడా తారల జాబితాలో క్రిస్టియానో ​​రొనాల్డో అగ్రస్థానంలో ఉన్నాడు. సంపాదన పరంగా కూడా టాప్ ప్లేయర్ల జాబితాలో చేరిపోయాడు. లియోనెల్ మెస్సీ రెండో స్థానంలో ఉన్నాడు. మెస్సీ అర్జెంటీనా టాప్ ప్లేయర్. మెస్సీ వయస్సు 36 సంవత్సరాలు. అతనిని ఇన్‌స్టాగ్రామ్‌లో 482 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.

విరాట్ కోహ్లీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 256 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్‌బుక్‌లో 50, ట్విట్టర్‌లో 51 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సంపాదించుకున్న విరాట్.. ఆసియా ఖండంలోనే మోస్ట్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీ. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న స్పోర్ట్స్ సెలబ్రిటిల్లో వరల్డ్‌లోనే టాప్ 3లో ఉన్న విరాట్ కోహ్లీ, ఒక్కో ఇన్‌స్టా పోస్ట్ ద్వారా రూ.11.45 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు.

Also Read: India Squad: ఆసియా కప్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు ఇదేనా..?

కోహ్లీ కంటే ముందు ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఒక్కో ఇన్‌స్టా పోస్ట్ ద్వారా రూ.26.7 కోట్లు, అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ రూ.21.5 కోట్లు సంపాదిస్తున్నారు. రొనాల్డో, మెస్సీ తర్వాత ఇన్‌స్టా ద్వారా అత్యధిక మొత్తం సంపాదిస్తున్న మూడో స్పోర్ట్స్ సెలబ్రిటీ విరాట్ కోహ్లీ. ట్విట్టర్‌లో ఒక్కో పోస్ట్‌కి రూ.3 కోట్ల వరకూ అందుకుంటున్నాడు. ఎంపీఎల్ వంటి 8 రకాల స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టాడు.

విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 111 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో అతను 7 డబుల్ సెంచరీలు, 29 సెంచరీలు చేశాడు. 29 అర్ధ సెంచరీలు కూడా చేశాడు. ఈ ఫార్మాట్‌లో కోహ్లీ 8676 పరుగులు చేశాడు. అతని అత్యుత్తమ టెస్టు స్కోరు 254 పరుగులు. కోహ్లీ 275 వన్డేల్లో 12898 పరుగులు చేశాడు. వన్డేల్లో 46 సెంచరీలు, 65 హాఫ్ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో అతని అత్యుత్తమ స్కోరు 183 పరుగులు. ఐపీఎల్, టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో కోహ్లీ ఎన్నోసార్లు అద్భుత ప్రదర్శన చేశాడు. కోహ్లీ IPLలో 237 మ్యాచ్‌లలో 7263 పరుగులు చేశాడు. 7 సెంచరీలు చేశాడు. 50 అర్ధ సెంచరీలు చేశాడు. కోహ్లి 115 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో 4008 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 37 హాఫ్ సెంచరీలు చేశాడు.