Site icon HashtagU Telugu

MI vs RCB: సూర్య ఆటకి ఫిదా అయినా కోహ్లీ.. సూర్యని అభినందిస్తున్న వీడియో వైరల్..!

MI vs RCB

Resizeimagesize (1280 X 720) (1)

ఐపీఎల్ 16వ సీజన్ 54వ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), రాయల్ ఛాలెంజర్స్ (RCB) మధ్య జరిగింది. సొంత మైదానంలో ఆర్‌సీబీ (RCB)తో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు 6 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ముంబైకి సూర్యకుమార్ యాదవ్ కేవలం 35 బంతుల్లో 83 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సూర్య అద్భుతమైన ఇన్నింగ్స్‌పై విరాట్ కోహ్లీ కూడా సంతోషం వ్యక్తం చేశాడు.

ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 3వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. ఇక్కడి నుంచి క్రమంగా పరుగుల వేగాన్ని పెంచుతూనే ఉన్నాడు. ఇందులో సూర్యకు యువ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ నెహాల్ వధేరా మంచి మద్దతు లభించింది. మ్యాచ్‌కి తిరిగి వచ్చేందుకు ఆర్‌సిబి బౌలర్‌లకు ఇద్దరూ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో ముంబై కేవలం 16.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి విజయం సాధించింది. మ్యాచ్‌లో 83 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి సూర్య అవుట్ అయినప్పుడు, ఆ సమయంలో విరాట్ కోహ్లి కూడా అతన్ని అభినందించడం కనిపించింది. కరచాలనం చేస్తూ కోహ్లి సూర్య వీపుపై తట్టాడు. సూర్యకుమార్ తిరిగి పెవిలియన్ బాట పట్టినప్పుడు, ఆ సమయంలో సచిన్ టెండూల్కర్ నుండి మిగతా వారి వరకు అందరూ అతని మ్యాచ్ విన్నింగ్‌ని ప్రశంసించారు.

Also Read: Karnataka Election 2023: నేడే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌.. ఏర్పాట్లు పూర్తి..!

RCBతో జరిగిన ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 83 పరుగుల ఇన్నింగ్స్ ఇప్పుడు అతని IPL కెరీర్‌లో అత్యంత వ్యక్తిగత ఇన్నింగ్స్‌గా మారింది. అంతకుముందు 2021 సీజన్‌లో ఆడిన మ్యాచ్‌లో 82 పరుగుల ఇన్నింగ్స్ ఆడుతూ సన్‌రైజర్స్ హైదరాబాద్ పై సూర్య ఐపిఎల్‌లో అత్యధిక స్కోరు సాధించాడు. ఇప్పటివరకు సూర్య బ్యాట్ నుంచి ఐపీఎల్ లో 20 హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ లు ఉన్నాయి.