Ganguly on Virat: కోహ్లీ ఫామ్ పై విమర్శకులకు దాదా కౌంటర్

సమకాలీన క్రికెట్ లో రన్ మెషీన్ గా పేరున్న విరాట్ కోహ్లీ గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయాడు. కోహ్లీ సెంచరీ సాధించి దాదాపు మూడేళ్లు దాటిపోయింది.

  • Written By:
  • Publish Date - July 14, 2022 / 05:08 PM IST

సమకాలీన క్రికెట్ లో రన్ మెషీన్ గా పేరున్న విరాట్ కోహ్లీ గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయాడు. కోహ్లీ సెంచరీ సాధించి దాదాపు మూడేళ్లు దాటిపోయింది. కెప్టెన్సీ ఒత్తిడి నుంచి తప్పుకున్న తర్వాత కూడా ఫామ్ లోకి రాకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కోహ్లీని టీ ట్వంటీ టీమ్ నుంచి పక్కన పెట్టాలని పలువురు మాజీ ఆటగాళ్ళు సూచిస్తున్నారు. ఈ నేపద్యంలో భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ కోహ్లీకి అండగా నిలిచాడు.
సత్తా, సామర్థ్యం లేనిదే విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌‌లో టన్నుల కొద్ది పరుగులు చేశాడా? అంటూ విమర్శకులను ప్రశ్నించారు. క్రీడాకారుల జీవితాల్లో ఇలాంటి గడ్డు పరిస్థితులు సర్వసాధారణమని చెప్పిన దాదా… తనతో పాటు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సైతం ఇలాంటి విషమ దశను ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేశాడు.

విరాట్ గొప్ప ఆటగాడనీ, తన సామర్థ్యానికి తగినట్లు ఆడటం లేదని, ఇది తనకు ఏ మాత్రం మంచిది కాదనే విషయం కోహ్లీకి తెలుసన్నాడు. అతి త్వరలోనే అతను మునపటి లయను అందుకోవడం మనం చూస్తామన్నడు. గత 12-13 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న అతనికి ఇది ఏం పెద్ద కష్టమైన పనికాదని దాదా విశ్లేషించాడు. ఎన్నో అంచనాలతో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 43 పరుగులే చేశాడు. గాయం కారణంగా వన్డే సీరీస్ కు దూరమయ్యాడు. వచ్చే విండీస్ టూర్ కు కూడా కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నానిర్ణయించారు. దీంతో కోహ్లీ కొన్నాళ్ళు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్లీ రీ ఎంట్రీలో అదరగొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.