Virat Kohli@50: వన్డేల్లో కోహ్లీ 50వ సెంచరీ, క్రికెట్ గాడ్ సచిన్ రికార్డులు బద్ధలు!

106 బంతుల్లో ఒక సిక్స్, 8 ఫోర్లతో కోహ్లీ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

  • Written By:
  • Updated On - November 15, 2023 / 05:54 PM IST

Virat Kohli: బుధవారం జరిగిన సెమీ-ఫైనల్ రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ప్రసిద్ధ వాంఖడే స్టేడియంలో రెచ్చిపోయాడు. సూపర్ సెంచరీతో న్యూజిలాండ్‌పై అద్భుతంగా ఆడి అంతర్జాతీయ వన్డే లో 50వ సెంచరీ నమోదు చేశాడు. 2023 ప్రపంచ కప్‌లో అద్భుత ఫామ్ ను కొనసాగిస్తూ, ICC టోర్నమెంట్ సెమీ-ఫైనల్‌లో కోహ్లీ టెండూల్కర్ రికార్డులను బద్దలు కొట్టాడు. మైదానంలోని ప్రేక్షకులు నిలబడి కోహ్లీని ఎంకరేజ్ చేయగా, సచిన్, అనుష్క శర్మ తమ చప్పట్లతో అభినందించారు.

మొదట 29 బంతుల్లో 47 పరుగుల వద్ద భారత కెప్టెన్ ఔట్ అయ్యాడు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ మరియు రోహిత్ ఇచ్చిన ఆరంభాలను క్యాష్ చేసుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కోహ్లి యాంకర్ పాత్రను పోషించాడు. ఈ దశలో కోహ్లి అద్భుతమైన నాక్‌తో ప్రపంచకప్ చరిత్రను లిఖించాడు. 2023 ప్రపంచకప్‌లో కోహ్లీ తన ఎనిమిదో యాభై ప్లస్ స్కోరును ఛేదించడం ద్వారా టెండూల్కర్‌ను అధిగమించాడు. మాస్టర్ బ్లాస్టర్ టెండూల్కర్ 2003 ప్రపంచకప్‌లో 7 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. 2023 ప్రపంచకప్‌లో ఎనిమిది 50-ప్లస్ స్కోర్లు సాధించిన కోహ్లి, 10 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఐకానిక్ ఫీట్ సాధించాడు. 2003 ప్రపంచకప్‌లో టెండూల్కర్ 11 ఇన్నింగ్స్‌లలో ఇదే మైలురాయిని అన్‌లాక్ చేశాడు.

తన 72వ వన్డే ఇంటర్నేషనల్ హాఫ్ సెంచరీని సాధించిన తర్వాత, కోహ్లి ప్రపంచ కప్ 2023లో టెండూల్కర్ మైలురాయిని ఛేదించడంపై దృష్టి పెట్టాడు. 23వ ఓవర్లో గాయపడిన గిల్‌తో కలిసి 93 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ తో జతకట్టాడు. 33వ ఓవర్‌ మూడో బంతికి సింగిల్ తీసి 2023 ప్రపంచ కప్‌లో 674-ప్లస్ పరుగులు చేయడం ద్వారా టెండూల్కర్‌ను దాటేశాడు. 2003 ప్రపంచ కప్‌లో లిటిల్ మాస్టర్ 673 పరుగులు చేశాడు. ఇక తర్వాత కోహ్లీ 106 బంతుల్లో ఒక సిక్స్, 8 ఫోర్లతో కోహ్లీ తన సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో 50 శతకాలు సాధించిన తొలి బ్యాట్స్మెన్ గా రికార్డు నెలకొల్పాడు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ చేసిన 49 సెంచరీల రికార్డును విరాట్ కోహ్లీ నేడు అధిగమించారు. 113 బంతుల్లో 117 సాధించి టాప్ స్కోరర్ గా నిలిచాడు కోహ్లీ.