ప్రస్తుతం ఐపీఎల్ 2023 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. మ్యాచులు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సోమవారం బెంగళూరు రాయల్ చాలెంజర్స్, లక్నో సూపర్ జియంట్స్ మ్యాచ్ రసవత్తరంగా సాగిన విషయం మనందరికీ తెలిసిందే. అంతా బాగానే ఉంది కానీ ఈ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన తీవ్ర వివాదం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ విషయం గురించి మాట్లాడుకోవడంతోపాటు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.
ఈ ఇద్దరి తీరు పట్ల బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఇద్దరిపై ఫైర్ అయిన బీసీసీఐ మ్యాచ్ ఫీజులో నూరు శాతం జరిమానాన్ని కూడా విధించింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇద్దరిలో తప్పు ఎవరిది అన్న విషయంపై జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. ఇది కాస్త కర్ణాటకలో రాజకీయ రంగు కూడా పులుముకుంది. కాగా ఈ విషయంలో విరాట్ కోహ్లీకి కన్నడిగులు మరి ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులు మద్దతును తెలుపుతున్నారు. బీజేపీ ఎంపీ కూడా లక్నో టీమ్ గౌతమ్ గంభీర్ కన్నడిగుల గర్వం అయిన కోహ్లీనీ బెదిరించాడు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
A BJP MP threatening Kannadigas pride RCB’s Virat Kohli. The People of Karnataka are ready to teach them a lesson on 13th May.pic.twitter.com/RqMpNijZGj
— Shantanu (@shaandelhite) May 1, 2023
ఈ విషయంలో కర్ణాటక ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనీ, ఈనెల 13వ తేదీన ఫలితాలు దాన్ని నిరూపిస్తాయి అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. సీనియర్ నేత కర్ణాటక మాజీ సీఎం సిద్ధ రామయ్య కూడా ఈ విషయంపై కాస్త ఘాటుగా స్పందించారు. ఈసారి కచ్చితంగా ఆర్సీబీ ఐపీఎల్ కప్పు గెలుస్తుంది అని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందంటూ జోష్యం చెప్పారు. ప్రస్తుతం కోహ్లీ గంభీర్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. కోహ్లీ గంభీర్ వివాదం ఇంకా ఎంతవరకు వెళుతుందో చూడాలి మరి.