Site icon HashtagU Telugu

Virat Kohli Flop: బెడిసికొట్టిన రోహిత్ శ‌ర్మ ప్లాన్‌.. పాక్‌తో ప్ర‌యోగాలు చేస్తాడో..? లేదో..?

Rohit- Kohli Retirement

Rohit- Kohli Retirement

Virat Kohli Flop: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024ను భారత జట్టు విజయంతో ప్రారంభించింది. ఈ వరల్డ్‌కప్‌లో ఎనిమిదో మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను చిత్తు చేసింది టీమిండియా. ఈ మ్యాచ్‌లో భారత జట్టు గెలిచినప్పటికీ, రోహిత్ శర్మ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. రోహిత్‌ చేసిన ప్రయోగం తప్పని తేలింది. భారత జట్టు ఐర్లాండ్ జట్టుతో ఆడిండి కాబ‌ట్టి ఇబ్బంది లేదు. టీమ్ ఇండియా ఈజీగా మ్యాచ్ గెలిచింది. అయితే ఐర్లాండ్ స్థానంలో పెద్ద జట్టు ఉంటే ఈ విజయం అంత సులభం కాక‌పోయేది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్‌పై ఆడ‌నున్న టీమిండియా స్క్వాడ్‌లో పెనుమార్పు కనిపించవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రోహిత్ ఏ నిర్ణయం తప్పు అని తేలింది?

ICC T20 ప్రపంచ కప్ 2024 ప్రారంభానికి ముందే చాలా మంది అనుభవజ్ఞులు రోహిత్ శర్మ- విరాట్ కోహ్లీ (Virat Kohli Flop)లను ఓపెనింగ్‌కు వ‌చ్చి బ్యాటింగ్ చేయాల‌ని సలహా ఇచ్చిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. భారత జట్టులోని చాలా మంది అనుభవజ్ఞులు కూడా ఈ కలయికను అత్యంత పరిపూర్ణమైన ఓపెనింగ్ పెయిర్‌గా పిలిచారు. అయితే రోహిత్ శర్మ చేసిన ఈ ప్రయోగం ఐర్లాండ్‌పై విఫలమైంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, కోహ్లీ ఓపెనింగ్‌కు వచ్చినా విరాట్ అద్భుతంగా అయితే ఆడ‌లేదు. వ‌చ్చిన వెంట‌నే పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు. దీంతో రోహిత్ తీసుకున్న నిర్ణ‌యం త‌ప్పు అని తేలింది.

Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ రికార్డు.. ప్ర‌పంచంలో అత్య‌ధిక ఫాలోవ‌ర్స్ ఉన్న రెండో ఆట‌గాడిగా గుర్తింపు..!

ఐర్లాండ్‌పై విరాట్ 5 బంతుల్లో ఒక పరుగు మాత్రమే చేసి ఔట‌య్యాడు. ఇటువంటి పరిస్థితిలో లక్ష్యం చిన్నది, ఐర్లాండ్ ముందు ఉంది. అందుకే విరాట్ అవుట్ అయిన తర్వాత కూడా టీం ఇండియా మ్యాచ్‌ను సులభంగా గెలిచింది. అయితే పాకిస్తాన్‌పై టీమ్ ఇండియా ఈ ప్రయోగం చేయాలనుకుంటుందా..? అనేది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌.

We’re now on WhatsApp : Click to Join

టీమ్ ఇండియా ఏం తప్పు చేసింది?

రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయడానికి మరే ఇతర ఆటగాడు వ‌చ్చినా అతను నిర్భయంగా ఆడతాడు. ఎందుకంటే ఒక వికెట్ పతనం తర్వాత ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి వస్తాడనే భావన ఉంటుంది. కానీ రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లి ఓపెనింగ్ ప్రారంభిస్తే.. ఒక్క వికెట్ పడితే టీమిండియాకు భారీ దెబ్బ తగులుతుంది. రోహిత్, విరాట్‌లను టీమ్ ఇండియా మెయిన్ పిల్ల‌ర్స్‌. కాబట్టి ఒక వికెట్ పతనం తర్వాత టీమ్ ఇండియా కష్టాల్లో ప‌డే అవ‌కాశం ఉంటుంది. ఐర్లాండ్‌పై రోహిత్ నిర్ణయం ఫ్లాప్ అయింది.కాబట్టి పాక్‌పై టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను మారుస్తుందా లేదా అదే కాంబినేషన్‌తో ఆడుతుందా అనేది చూడాలి.