Site icon HashtagU Telugu

Virat Kohli Flop: వైఫల్యాల బాట వీడని కోహ్లీ

Virat Imresizer

Virat Imresizer

ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ప్రత్యర్థి మారినా… వేదిక మారినా…చివరికి బ్యాటింగ్ స్థానం మారినా.. విరాట్ ఆట మాత్రం మారడం లేదు. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ కోహ్లీ నిరాశపరిచాడు. ఓపెనర్‌గా వచ్చినా ఫామ్ అందుకోలేకపోయిన విరాట్ 9 రన్స్ కే ఔటయ్యాడు. నిజానికి గోల్డెన్ డక్ ఔటయ్యే ప్రమాదం నుంచి తృటిలో కోహ్లీ తప్పించుకున్నాడు. అయితే ఇలా లక్ కలిసొచ్చిన దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

బౌల్ట్ ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదిన కోహ్లీ.. మరుసటి ఓవర్‌లో ప్రసిధ్ కృష్ణ వేసి బౌన్సర్‌కు బలయ్యాడు. ప్రసిధ్ షార్ట్ పిచ్ బాల్‌‌ ను సరిగ్గా అంచనా వేయలేకపోయిన కోహ్లీ తొందరగా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. దాంతో బంతి బ్యాట్ బాటమ్ తాకి గాల్లోకి లేవగా రియాన్ పరాగ్ క్యాచ్ అందుకున్నాడు.లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన వరుస మ్యాచ్‌ల్లో కోహ్లీ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.

ఈ సీజన్ ఆరంభం నుంచీ కోహ్లీ పెద్ద ఇన్నింగ్స్ లు ఆడలేకపోతున్నాడు. 9 మ్యాచ్ లలో కోహ్లీ అత్యధిక స్కోర్ 48. తొలి మ్యాచ్ లో 41 , తర్వాత మ్యాచ్ లలో వరుసగా 12 , 5 , 48 , 1 , 12, 0 , 0, 9 స్కోర్లు చేశాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో కోహ్లీ ఇక చెలరేగుతాడనీ అంతా భావించారు. అయితే ఇప్పటి వరకు ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. రానున్న మ్యాచ్ లోనైనా కోహ్లీ ఫామ్ అందుకోవాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.

Exit mobile version