Site icon HashtagU Telugu

Virat Kohli Record: చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ రికార్డ్.. ఒకే గ్రౌండ్ లో 2500 పరుగులు!

Kohli Rcb

Kohli Rcb

విరాట్ కోహ్లి IPL రికార్డులకు కొత్తేమీ కాదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట్స్ మెన్ అయినా కోహ్లీ (Virat Kohli) ఇవాళ మరో రికార్డును అందుకున్నాడు. ఒకే వేదికపై 2500 పరుగులు చేసిన మొదటి బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియంలో 11 పరుగుల వద్ద కోహ్లీ ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక పరుగుల స్కోరర్ అయిన విరాట్ కోహ్లీ 2016 సీజన్‌లో 973 పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ రికార్డు నేటికీ నిలిచి ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోహ్లి 5 సెంచరీలు, 46 హాఫ్ సెంచరీలు, అత్యుత్తమ 113 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లి ఇప్పుడు ఐపీఎల్‌లో 7000 పరుగుల మార్కుకు దగ్గరగా ఉన్నాడు.

కోహ్లి 2022లో 16 మ్యాచ్‌లలో 22.73 సగటుతో 341 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఫామ్ లేని కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే, గత ఏడాది ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై అతని తొలి T20I సెంచరీ తర్వాత విరాట్ కోహ్లీ ఒక్కసారిగా వేగం అందుకున్నాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌పై సెంచరీతో 2022ని ముగించాడు. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన 3-మ్యాచ్‌ల ODI సిరీస్‌లో రెండు సెంచరీలతో 2023ని ఘనంగా ప్రారంభించాడు. ఆపై, అహ్మదాబాద్‌లో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో విరాట్ కోహ్లీ 186 పరుగులతో టెస్ట్ క్రికెట్‌లో తన వంద కరువును ముగించాడు.

చిన్నస్వామి స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరఫున సీజన్ ఓపెనర్‌లో విరాట్ కోహ్లీ గొప్ప టచ్‌లో ఉన్నాడు. 172 పరుగుల ఛేదనలో, కోహ్లి 49 బంతుల్లో 82 పరుగులతో ఆతిథ్య జట్టుకు అత్యధిక స్కోరు చేశాడు. ఓపెనింగ్ భాగస్వామి, డు ప్లెసిస్‌తో కలిసి 148 పరుగులు జోడించాడు.

Also Read: 6 Died: ఉత్తరప్రదేశ్‌లో ఘోరం.. బ్రిడ్జిపై నుంచి పడిన ట్రాక్టర్ ట్రాలీ, 6 మృతి!